pizza
Sri Sri Success Meet
‘శ్రీశ్రీ’ సక్సెస్ మీట్
you are at idlebrain.com > News > Functions
Follow Us

06 June 2016
Hyderabad

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల, న‌రేష్‌, సుధీర్ బాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీశ్రీ’. ఎస్‌.బి.ఎస్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 3న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో...

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘’శ్రీ శ్రీ చిత్రం ఇది వరకు తెలుగు సినిమాలు ఆడని దేశాల్లో కూడా ఆన్ లైన్ లో విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకోవడం ఆనందంగా ఉంది. చాలా చోట్ల నా డైలాగ్స్ కు, విజయ నిర్మల డైలాగ్స్ కు క్లాప్స్ కొడుతున్నారు. డైరెక్టర్ ముప్పలనేని శివగారు సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు. నిర్మాతలు అన్ కాంప్రమైజ్డ్ గా సినిమాను చక్కగా నిర్మించారు. కలెక్షన్స్ బావున్నాయని అంటున్నారు. ఇంకా కలెక్షన్స్ పెరిగి సూపర్ హిట్ రేంజ్ కు ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ ‘’జూన్ 3న విడుదలైన మా శ్రీ శ్రీ చిత్రం యూనానిమస్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ కావడం ఆనందంగా ఉంది. ఆరేళ్ళ తర్వాత కృష్ణగారు నటించిన సినిమా ఇది. మంచి సినిమా చేశారని అందరూ మెచ్చుకుంటున్నారు. గతంలో కృష్ణగారు నటించిన పవర్ ఫుల్ రోల్స్ లాగే ఈ సినిమాలో ఆయన శ్రీ శ్రీ రోల్ పవర్ ఫుల్ గా ఉందని అంటున్నారు. నిర్మాతలు యువకులైన చాలా మంచి సినిమాను నిర్మించారు. అలాగే ఎం.ఫ్లిక్స్ వరల్డ్ ద్వారా రాజు నడింపల్లిగారు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ఓవర్ సీస్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కృష్ణగారి సినిమా చరిత్రలో గొప్పచిత్రంగా ఇది నిలిచిపోతుంది’’ అన్నారు.

రాజు నడింపల్లి మాట్లాడుతూ ‘’మా ఆన్ లైన్ సంస్థ ద్వారా శ్రీశ్రీ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దీని ద్వారా ఆయన కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశారు. ఓవర్ సీస్ లో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని మనకు తెలుసు. కానీ తెలుగు సినిమాలు విడుదల కానీ కెన్యా, ఉగాండా, మొరాకో, ఘనా దేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. మంచి సక్సెస్ ఫుల్ మూవీ చేసిన కృష్ణగారికి, ముప్పలనేని శివగారు, నిర్మాతలు సహా అందరికీ కంగ్రాట్స్’’ అన్నారు.

చిత్ర నిర్మాతలు చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్ మాట్లాడుతూ ‘’శ్రీశ్రీ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి కలెక్షన్స్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఎంఫ్లిక్స్ వరల్డ్ ద్వారా ఆన్ లైన్ విదేశాల్లో విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని మాకు కల్పించిన కృష్ణగారికి, ముప్పలనేని శివగారికి థాంక్స్’’ అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved