pizza
Akshara teaser launch
అక్షర టీజర్ లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 June 2019
Hyderabad

హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం ‘అక్షర’ ఈమూవీ టీజర్ లాంచ్ సక్సెస్ పుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి చేతులుమీదుగా జరిగింది. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం చాలా ఆసక్తిగా సాగుతుంది. ఒక సీరియస్ పాయింట్ ని తీసుకొని ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా రూపొందిచిన చిత్రం ‘అక్షర’. నందిత శ్వేతా లుక్స్ కిమంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుందని నమ్ముతుంది చిత్రయూనిట్. ఈ మూవీ టీజర్ లాంచ్ కి చిత్ర యూనిట్ తోపాటు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, వరస విజయాలతో టాలీవుడ్ లో తనదైన ముద్రను వేసిన దర్శకుడు అనీల్ రావిపూడి పాల్గోన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బి. చిన్ని కృష్ణ మాట్లాడుతూ: ‘‘నేను చెప్పిన లైన్ విని దర్శకుడుగా నాకు ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు సురేష్ వర్మ, అహితేజ లకు నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకూ కామెడీ సినిమాలు చేసాను. కానీ ‘అక్షర’ లో ఒక సీరియస్ పాయింట్ ని డిస్కస్ చేసాం. గవర్నమెంట్ పాలసీల మీద మాట్లాడాము.నా జీవితంలో ప్రత్యేక సినిమాగా ‘అక్షర’ మిగులుతుంది. కథ చెప్పగానే సినిమాకు అంగీకరించి అక్షరకు పాత్రకు రూపం ఇచ్చిన నందిత శ్వేత గారి ప్రత్యేక ధన్యావాదాలు. పదినిముషాలు ఈ కథ వినగానే అనీల్ రావిపూడి హిట్ కొడుతన్నావ్ అని అన్నాడు. అనీల్ నాకు మంచి మిత్రుడు అనీల్ బాగుంటే అందరూ బాగుంటారు ఈ ఒక్కమాట చెప్పగలను అనీల్ గురించి. ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో రావాలి. అదే అక్షర చేసే పోరాటం ’’ అన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ: ‘‘ఈ సినిమా చేస్తూన్నప్పుడే బాగా ఆడుతుందనే ఫీల్ కలిగింది. కొద్ది సినిమాలకే అలాంటి ఫీల్ కలుగుతుంది. అక్షర తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. ఇక కామెడీ విషయానికి మీ పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం . ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికీ, నిర్మాతలకీ నా కృతజ్ఞతలు’’ అన్నారు.

శ్రీ తేజ్ మాట్లాడుతూ: ‘‘ ఇది కాన్సెప్ట్ ఓరియెంటడ్ మూవీ , ఇందులో నా పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. అవకాశం ఇచ్చిన చిన్నికృష్ణ గారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు.

నందితాశ్వేత మాట్లాడుతూ: ‘‘ ఒక మెసేజ్ ఓరియెంటడ్ మూవీ. హీరోయిన్ సెంట్రిక్ గా చేయడానికి నిర్మాతలకు చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యంతో ముందుకు వచ్చి న సురేష్, అహితేజ లకు అభినందనలు. అక్షర సినిమాకు నా కెరియర్ లో ప్రత్యేక స్థాన ఉంటుంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్, సాంగ్ అంతా సీరియస్ గా కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసాయి. సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో టీజర్ చూస్తే తెలుస్తుంది. నా లుక్స్ బాగా రావడానికి కాస్టూమ్ డిజైనర్ గౌరీ నాయుడు కారణం. అందరూ లుక్స్ బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్స్. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ: ‘‘దర్శకుడు చిన్ని కృష్ణ గారు చెప్పిన లైన్ బాగా నచ్చింది. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సమస్యను తీసుకొని ఆయన పుల్ ఎంటర్ టైన్మెంట్ వేలో సినిమాగా మలిచారు. మా టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన అనీల్ రావిపూడిగారికి కృతజ్ఞతలు. సినిమాను ఆగష్టులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

శివశంకర్ మాస్టార్ మాట్లాడుతూ: ‘‘ డాన్స్ మాస్టర్ నేనోంటో అందరికీ తెలుసు. కానీ నటుడుగా కూడా నేను మెప్పించగలను అని నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అన్నారు.

మధురా శ్రీధర్ గారు మాట్లాడుతూ: ‘‘ అక్షర సినిమా పైపర్ మీద ఐడియా ఉన్నపటి నుండీ నాకు తెలుసు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు. నేను ఎక్కవుగా గవర్నమెంట్ పాలసీలను స్టడీ చేస్తుంటారు. సెకండరీ ఎడ్యుకేషన్ వరకూ ఉన్న పాలసీ మీద నాకు చాలా అసంతృప్తి ఉండేది. ఇప్పుడు అక్షర లో చూపించబోతున్న పాయింట్ కూడా అదే కావడంతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. టీం కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ: ‘‘ఒక పాత్రకేయుడు రాసే అక్షరం వేలమందిని కదిలిస్తుంది. ఒక వివేకవంతుడ రాసే అక్షరం చాలామందికి జ్ఞానాన్ని పంచుతుంది. ఒక రచయిత తెరమీద రాసే అక్షరం చాలా మందిఆలోచనలను కదిలిస్తుంది. అక్షరానికి అంత విలువ ఉంది, భాద్యత ఉంది. అలాంటి అక్షరం అనే టైటిల్ తో వస్తున్న మూవీ తప్పకుండా మంచ విలవలతో ఉంటుంది అని నమ్ముతున్నాను. టీజర్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొస్తున్న నిర్మాతలకు నా అభినందనలు. నందితా శ్వేతా మంచ ఆర్టిస్ట్ ఈ సినిమాలో తన లుక్స్ బాగున్నాయి. నాకున్న మంచి స్నేహితులలో చిన్ని కృష్ణ ఒకడు. నా మొదటిసినిమా పటాస్ టేకాఫ్ అవడానికి అతను చేసిన సహాయం ఎప్పటకీ మర్చిపోలేను. ఒక దర్శకుడు ఆలోచన ఫెయిల్ అవ్వొచ్చు కానీ ప్రయత్నం ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదు. ఈ కథ విన్నాను నాకు బాగా నచ్చింది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ’’ అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ్, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో నిపించబోతోన్న ఈ చిత్రానికి
కెమెరామెన్: నగేష్ బెనెల్ ,
మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి,
ఎడిటర్: జి.సత్య,
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి,
కాస్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు,
లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి,
పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా,
కో-ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి. సుమంత్ కొప్పురావూరి
నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved