pizza
Evaro Thaanevaro teaser launch
`ఎవ‌రో తానెవ‌రో` టీజ‌ర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 September 2016
Hyderaba
d

 

న‌వీన్ గౌత‌మ్‌, ప్రియాంక, స‌ర‌యు, చ‌ల‌ప‌తిరావు, స‌మీర్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా బ‌షీరమ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.కె.రెహ‌మాన్‌(చంటి) నిర్మించిన చిత్రం `ఎవ‌రో తానెవరో`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్యక్ర‌మం గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాజ్ కందుకూరి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా, చ‌ల‌ప‌తి రావు సినిమా లోగోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``టీజ‌ర్ బావుంది. చూస్తుంటే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఉంది. ద‌ర్శ‌కుడు బాబ్జీ సినిమాను తెర‌కెక్కించిన తీరు బావుంది. నిర్మాత పెట్టిన ప్ర‌తి రూపాయికి మూడురెట్లు లాభాలు రావాల‌ని కోరుకుంటూ యూనిట్‌ను అభినందిస్తున్నాను`` అన్నారు.

నటుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ -``చిన్న సినిమాలు ఆడాల‌ని కోరుకునే వాళ్ళ‌లో నేను ఒక‌డిని. అందుకే నిర్మాత రెహ‌మాన్ అడ‌గ్గానే సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. టీం అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. టీజ‌ర్ బావుంది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని దర్శ‌కుడు బాబ్జీ, నిర్మాత రెహ‌మాన్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు బాబ్జీ మాట్లాడుతూ - ``ప‌ద‌కొండేళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ద‌ర్శ‌కుడు కావాల‌ని ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. నువ్వు ద‌ర్శ‌కుడు అవుతావు...అని ప్రోత్స‌హించిన మొద‌టి వ్య‌క్తి అన్న స్వ‌ర్గీయ శ్రీహ‌రిగారు. ఆయ‌న ప్రోత్సాహంతోనే ఇక్క‌డ వ‌ర‌కు రాగ‌లిగాను. రెహ‌మాన్‌గారు ద‌ర్శ‌కుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయ‌న ప‌డ్డ క‌ష్ట‌మెంటో తెలుసు. అంద‌రం క‌ష్ట‌ప‌డి ఓ మంచి సినిమాను చేశామ‌ని భావిస్తున్నాం. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత ఎస్‌.కె.రెహ‌మాన్ మాట్లాడుతూ - ``నాకు సినిమాలంటే ఉన్న ఆస‌క్తితోనే ఈ సినిమాకు నిర్మాత‌గా మార‌డ‌మే కాకుండా ఇందులో చిన్న పాత్ర‌లో న‌టించాను. హీరో హీరోయిన్లు కొత్త వారైన ఎంతో చ‌క్క‌గా యాక్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు బాబ్జీగారు సినిమాను బాగా తీశారు. మా ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో న‌వీన్ గౌత‌మ్‌, ప్రియాంక‌లు ద‌ర్శ‌క నిర్మాత‌లు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.
న‌వీన్ గౌత‌మ్‌, ప్రియాంక, స‌ర‌యు, చ‌ల‌ప‌తిరావు, స‌మీర్, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఫ‌ణి, బి.హెచ్‌.ఇ.ఎల్. ప్ర‌సాద్‌, సూర్య‌తేజ‌, మ‌మతా రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ః రాంబాబు.డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః క‌పిల్ వ‌రికూటి, ఎడిట‌ర్ః ఉద‌య్ చైత‌న్య యాద‌వ్‌, కెమెరాః పురుషోత్తం, మ్యూజిక్ః ఎస్‌.శ్రీరాం, నిర్మాతః ఎస్‌.కె.రెహ‌మాన్‌(చంటి), ద‌ర్శ‌క‌త్వంః ఎస్‌.బాబ్జీ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved