pizza
HBD (Hacked by Devil) teaser launch
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న `హ్యాక్‌డ్ బై డెవిల్‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 December 2016
Hyderaba
d

మేఘ‌న‌, సంతోషి, స‌ల్మాన్‌, హిమ‌జ త‌దిత‌రులు తారాగ‌ణంగా కృష్ణ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్‌భాస్క‌ర్‌.వై నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `హ్యాక్‌డై బై డెవిల్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ గురువారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌సత్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ``నిర్మాత ఉద‌య్‌భాస్క‌ర్ నాకు మంచి మిత్రుడు. ప‌బ్లిసిటీ రంగంలో ముందుండే వ్య‌క్తి. సినిమాల‌పై మంచి క‌మాండ్ ఉన్న వ్య‌క్తి. ద‌ర్శ‌కుడు మంచి డిజైన‌ర్ కూడా. డైరెక్ట‌ర్ మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జ‌న‌వ‌రి 1న విడుద‌ల చేసి ఫిభ్ర‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు`` అన్నారు.

డైరెక్ట‌ర్ కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ - ``నేను ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌ని. నేను డైరెక్ట‌ర్ కావాల‌నుకున్నాను. మంచి నిర్మాత స‌హకారంతో ఈ సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేశాను. సినిమా చ‌క్క‌గా వ‌చ్చింది. స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌. సినిమా ఆడియో జ‌న‌వ‌రిలో, మూవీని ఫిభ్ర‌వ‌రి మొదటి వారంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

Glam gallery from the event

నిర్మాత ఉద‌య్‌భాస్క‌ర్.వై మాట్లాడుతూ - ``నేను, డైరెక్ట‌ర్ వేర్వేరు కాదు. కార్తీక్ మంచి ద‌ర్శ‌కుడు. ఇంకా మంచి సినిమాలు చేయ‌గ‌ల‌డు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

హ్యాక్‌డ్ బై డెవిల్ సినిమా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్ అని హీరో స‌ల్మాన్‌, హీరోయిన్స్ మేఘ‌న‌, సంతోషి తెలియ‌జేశారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ః మ‌హి మ‌ద‌న్ యం.యం., సినిమాటోగ్ర‌ఫీః క‌న్నా కోటి, ఎడిట‌ర్ః కె.ఆర్‌.స్వామి, డైలాగ్స్ః అభ‌య్ శ్రీజ‌య్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విన‌య్ గౌడ్‌.వై, నిర్మాతః ఉద‌య్‌భాస్క‌ర్‌.వై, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః కృష్ణ కార్తీక్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved