pizza
June 1:43 teaser launch
`జూన్ 1:43` టీజ‌ర్ విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 May 2017
Hyderabad

ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మిస్తున్న చిత్రం `జూన్ 1:43`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. నిర్మాత ల‌క్ష్మి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం..

ల‌క్ష్మి మాట్లాడుతూ - ``నాకు సినిమాల గురించి పెద్ద‌గా తెలియ‌వు. అయితే భాస్క‌ర్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. భాస్క‌ర్‌గారు సినిమాను ఎంతో చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఆదిత్య‌, రిచా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషిగారు, శ్ర‌వ‌ణ్ స‌హా టెక్నిషియ‌న్స్ ఎంతో స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం. జూన్ 1ః43 అన్న‌ట్లుగానే సినిమాను జూన్‌లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం `` అన్నారు.

ఆదిత్య మాట్లాడుతూ - ``మంచి రోల్ చేశాను. భాస్క‌ర్‌గారు సినిమాను ఆద్యంతం ఎంతో చ‌క్క‌గా తెర‌కెక్కించారు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అందించిన స‌హాకారంతో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ బంటుప‌ల్లి మాట్లాడుతూ - ``ల‌క్ష్మిగారు అందించిన స‌పోర్ట్‌తోనే సినిమాను చేయ‌గ‌లిగాను. నేను షార్ట్ పిలిం ద‌ర్శ‌కుడిని అయిన త‌ర్వాత వేణుగారి ల‌క్ష్మిగారికి ప‌రిచ‌యం చేశారు. అంద‌రం క‌ష్టంతో ఇష్ట‌ప‌డి చేసిన ఈ సినిమాను టైటిల్‌కు త‌గిన‌ట్టుగానే జూన్‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం`` అన్నారు.

మ‌ల్హర్‌భ‌ట్ జోషి మాట్లాడుతూ - ``సినిమా చేయ‌డానికి ముందు లైన్ విన్నాను. లైన్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌ర్నీ ఎంటర్ టైన్ చేసే స‌బ్జెక్ట్‌`` అన్నారు.

ఆదిత్య‌, రిచా, వేణు, సాయి, బ‌న్ను, కాశీవిశ్వ‌నాథ్‌, మ‌ధుమ‌ణి, తోట‌ప‌ల్లి మ‌ధు, కేధార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, కెమెరాః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, మ్యూజిక్ః శ్ర‌వ‌ణ్‌, నిర్మాతః ల‌క్ష్మి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బంటు ప‌ల్లి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved