pizza
Lacchi Teaser Launch
'లచ్చి' టీజర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 August 2016
Hyderaba
d

జయతి గడ్డం టైటిల్‌ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'లచ్చి'. ఈశ్వర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో చంద్రమోహన్‌, రఘుబాబు, ధనరాజ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగా రాష్ట్ర ఢిల్లీ ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలాచారి టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఎస్‌.వేణుగోపాలాచారి మాట్లాడుతూ - ''లచ్చి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎక్కువగా వినపడుతుంటుంది. అదే పేరుతో సినిమా రావడం ఎంతో ఆనందంగా ఉంది. స్టార్‌ హీరోలుంటేనే సినిమా హిట్‌ అవుతుందనే రోజులు ఇప్పుడు మారుతున్నాయి. కథాబలం ఉన్న చిత్రాలే సక్సెస్‌ అవుతాయని రీసెంట్‌గా పెళ్ళిచూపులు చిత్రం ప్రూవ్‌ చేసింది కూడా. లచ్చి సినిమా కూడా పెళ్ళిచూపులు తరహాలో పెద్ద విజయాన్ని సాధించాలి. వెన్నెల అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైన జయతి ఈసినిమాతో హీరోయిన్‌గా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి'' అన్నారు.

జయతి గడ్డం మాట్లాడుతూ - ''ఆరేడు నెలల పాటు చాలా కష్టపడి సినిమాను చిత్రీకరించాం. చిత్తూరుజిల్లాలోని మారుమూల పల్లెల్లో సినిమాను షూటింగ్‌ను, భారీ వర్షాలప్పుడు కూడా చేశాం. సినిమా బాగా వచ్చింది. మా ప్రయత్నాన్ని అదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Glam galleries from the event

తేజు మాట్లాడుతూ - ''విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే హర్రర్‌ చిత్రం. వచ్చే నెలలో ఆడియో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

తేజ్‌ దిలీప్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా దర్శకుడు ఈశ్వర్‌గారు పవన్‌కల్యాణ్‌, బోయపాటి శ్రీనుగారి వద్ద పనిచేశారు. విలేజ్‌ నేపథ్యంలో లిమిటెడ్‌ బడ్జెట్‌ను సినిమాను చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది'' అన్నారు.

చంద్రమోహన్‌, రఘుబాబు, జయతి, ధనరాజ్‌, తాగుబోతు రమేష్‌, రామ్‌ ప్రసాద్‌, షేకింగ్‌ శేషు, రచ్చ రవి, పూర్ణిమ, తేజ్‌ దిలీప్‌, తేజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: పార్థసారథి వర్మ, ఎడిటర్‌: ప్రభు, సాహిత్యం: కందికొండ, డైలాగ్స్‌: మరుధూరి రాజా, సంగీతం: సురేష్‌ యువన్‌, ఫోటోగ్రఫీ: ఎం.వి.రఘు, నిర్మాత: జయతి గడ్డం, డైరెక్టర్‌: ఈశ్వర్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved