ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్‌పై అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చన శాస్త్రి, ఆషిమా నర్వాల్, శ్రిత చందన, పావని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్ తదితరులు తారాగణంగా అశ్విని కుమార్.వి దర్శకత్వంలో శ్వేతా సింగ్ నిర్మిస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ `9`. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ - ``నాకు రెండు నిర్మాణ సంస్థలున్నాయి. అందులో ఒకటి ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం `9`.కొత్త కాన్సెప్ట్, కొత్త టీంతో చేసిన ప్రయత్నమిది. ముందు అశ్విని కుమార్, సినిమాటోగ్రాఫర్ సునీల్‌కుమార్ నా వద్దకు కథతో వచ్చినప్పుడు విన్నాను. నాకు ఎంతో నచ్చింది. 2016 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం 9 నెలలు పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. సినిమాను 32 రోజుల్లో తీద్దామని అనుకున్నాం. కానీ 27 రోజుల్లోనే పూర్తి చేశాం. మదనపల్లి, హార్సిలీ హిల్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమాను షూట్ చేశాం. నటీనటులు, టెక్నిషియన్స్ సహకారంతోనే సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం`` అన్నారు.
దర్శకుడు వి.అశ్వినికుమార్ మాట్లాడుతూ - ``ఈ కథను 2011లోనే సిద్ధం చేసుకున్నాం. అప్పట్లో షార్ట్ ఫిలిం కూడా చేశాం. తర్వాత ఐదారేళ్ళలో కథలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. కథ విన్న నిర్మాతలందరూ బావుందంటున్నారు, కొత్తగా ఉందని అన్నారు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని చెప్పారు. అయితే శ్వేతా సింగ్‌గారు మాత్రం కథను నమ్మి ఏ మార్పు లేకుండా సినిమా చేయమని అన్నారు. సినిమా టైటిల్ 9 అనే సంఖ్య చుట్టూ కథకు సంబంధించి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే నలుగురు ఘోస్ట్ హంటర్స్ ఓ హాంటెడ్ హౌస్‌లో దెయ్యాలున్నాయా లేవా అని పరిశోధన చేయడానికి వెళ్ళినప్పుడు వారికెలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే సినిమా కథ. సినిమా బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన నిర్మాత శ్వేతగారికి, నటీనటులు, ఇతర టెక్నిషియన్స్‌కు థాంక్స్`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సునీల్‌కుమార్ ఎన్. మాట్లాడుతూ - ``డిఫరెంట్ కాన్సెప్ట్. నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి థాంక్స్. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
Glam gallery from the event
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - ``ముందుగా సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఓ ఇంగ్లీష్ సాంగ్ కూడా సినిమాలో ఉంటుంది. ట్యూన్స్ చేయడానికి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు`` అన్నారు.
ఈ కార్యక్రమంలో అషిమా నర్వాల్, శ్రిత చందన, పావని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్, విమల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి విఎఫెక్స్ః వెంకట్.కె, సౌండ్ ఎఫెక్ట్స్ః విష్ణు పి.సి, అరుణ్.ఎస్, కాస్ట్యూమ్ డిజైనర్ః అశ్వంత్ బైరీ, కొరియోగ్రఫీః ఉదయ్‌భాను, ఎడిటర్ః గారీ బి.హెచ్, మ్యూజిక్ః శ్రీచరణ్ పాకాల, ఆర్ట్ః కిరణ్‌కుమార్.ఎం, డైలాగ్స్ః కిట్టు విస్సాప్రగడ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః రమేష్ శర్మ.ఎం, నిర్మాతః శ్వేతా సింగ్, స్ర్కీన్‌ప్లే, కథ, దర్శకత్వంః అశ్వినికుమార్.వి.