బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం స్పీడున్నోడు. గుడ్ విల్ సినిమా బ్యానర్‌పై భీమనేని రోషితా సాయి సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమనేని సునీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా....
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ''సినిమాకు సంబంధించిన చిత్రీకరణ 4-5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. డబ్బింగ్ పూర్తయింది. రేపటి నుండి రీరికార్డింగ్ పనులు జరగనున్నాయి. ఫిభ్రవరి మొదటివారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తమిళంలో విజయవంతమైన సుందరపాండ్యన్ సినిమాకు ఇది రీమేక్. కన్నడ రీమేక్ కూడా సక్సెస్ అయింది. సుస్వాగతం, శుభాకాంక్షలు, సుడిగాడు తర్వాత ఈ సినిమా సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్‌పై మూడు సంవత్సరాలు వర్క్ చేశాను. మన నెటివిటీకి సంబంధించిన ఎలిమెంట్స్‌ను యాడ్ చేసుకుంటూ వచ్చాను. ప్రతి సీన్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. శ్రీనివాస్ క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేశాడు. అల్లుడు శీను చిత్రంతో ఫైట్స్, డ్యాన్సులు బాగా చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంతో పెర్‌ఫార్మెన్స్ కూడా అదరగొట్టాడు. పది, పదిహేను సినిమాలు చేసిన హీరోలా యాక్ట్ చేశాడు. మైండ్‌లెస్ ఎంటర్‌టైనర్‌లా కాకుండా సుగర్‌కోటెడ్ ఎంటర్‌టైనర్‌లా సినిమా ఉంటుంది. ఒక స్ట్రాంగ్ ఎంటర్‌టైనింగ్ పాయింట్ తీసుకుని దానికి ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేశాను. దీనికి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. తమిళం, కన్నడం కంటే తెలుగులో పదిరెట్లు సినిమా బాగా వచ్చింది. లవ్, ఫ్రెండ్ షిప్ పాయింట్స్ తీసుకుని సోల్ మిస్ కాకుండా ఎంటర్ టైనింగ్ సినిమాను తెరకెక్కించాం. దీనికి వసంత్ మ్యూజిక్, విజయ్ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ ప్లస్ అయ్యాయి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ``అల్లుడు శీను తర్వాత ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచించాను. సుందరపాండ్యన్ సినిమా చూడగానే బాగా కనెక్ట్ అయింది. భీమనేని శ్రీనివాసరావుగారితో వర్క్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన దర్శకత్వంతో పాటు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుని నడిపించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్‌గారికి సినిమాటోగ్రాఫర్ విజయ్, గౌతంరాజుగారు, వసంత్ ఇలా అందరికీ స్పెషల్ థాంక్స్`` అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ``శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఒక పోస్టర్, టీజర్ విడుదల కాకుండానే బిజినెస్ మొత్తం పూర్తయింది. ప్యాన్సీ రేటుకు సినిమా బిజినెస్ పూర్తి కావడం అందరికీ ఎంతో కాన్ఫిడెన్స్ నిచ్చింది. మాకే కాదు ఈ సినిమాతో అందరికీ లాభాలు గ్యారంటీ`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వసంత్, ఎడిటర్ గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్ మన్నె, సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉలగనాథ్, విజయ్‌కుమార్ కొండా, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని హీరోను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది.