pizza
Carlo Shikarukelithe Teaser launch
`
కారులో షికారుకెళితేటీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 August 2016
Hyderaba
d

శ్రీ హ‌రి హర ఫిలింస్ బ్యాన‌ర్‌పై ధీరు మ‌హేష్‌సురేష్సుద‌ర్శ‌న్ క‌ళాధ‌ర్‌ప్రియ‌ఇషికా సింగ్ త‌దిత‌రులు ప్రధాన తారాగ‌ణంగా మాదాల కోటేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధు,అనీష్‌అభిరాం నిర్మించిన చిత్రం `కారులో షికారుకెళితే`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్రుమం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో జరిగింది. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను మాదాల ర‌వి విడుద‌ల చేయ‌గాటీజ‌ర్‌ను బెక్కం వేణుగోపాల్ విడుద‌ల చేశారు. అనంతరం....

ద‌ర్శ‌కుడు మాదాల కోటేశ్వ‌రారావు మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. న‌టీన‌టులుటెక్నిషియ‌న్స్ స‌హకారంతో సినిమాను అనుకున్న రీతిలో తెర‌కెక్కించాను. ఇలాంటి స‌హకారం దొరికితే మ‌రిన్ని మంచి సినిమాలు చేస్తాను`` అన్నారు.

మాదాల ర‌వి మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు వ‌న్ మ్యాన్ ఆర్మీ. త‌న‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. ప‌బ్లిసిటీ విష‌యంలో కేర్ తీసుకుంటే సినిమాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌వ‌చ్చు. అందుకు ఉదాహ‌ర‌ణే పెళ్ళిచూపులు. పెద్ద బ్యాన‌ర్‌లో విడుద‌లైన చిన్న సినిమా అయినా ప‌బ్లిసిటీ విష‌యంలో కేర్ తీసుకోవ‌డం వల్ల మంచి విజ‌యాన్ని సాధించింది. అలాంటి ప్లానింగ్‌తో ఈ సినిమా యూనిట్ కూడా ముందుకెళ్ళాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ``టీజ‌ర్ చాలా బావుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమా బావుంటే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు`` అన్నారు.

సినిమాలో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లకు హీరో హీరోయిన్స్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

మ‌లినేని ల‌క్ష్మ‌య్య చౌద‌రిజ‌బ‌ర్‌ద‌స్త్ ఫ‌ణిరాము,        జీవాహేమంత్‌స్ర‌వంతి త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః చంద్ర‌శేఖ‌ర్ వేమూరి,ఎడిట‌ర్ః వి.ఆర్‌.ఆనంద్‌ఆర్ట్ః శ్రీనివాస్‌మాట‌లుః ల‌క్కీప్ర‌దీప్ నామ‌నిసంగీతంః మీనాక్షి భుజంగ్‌నిర్మాత‌లుః మ‌ధుఅనీష్‌అభిరాంర‌చ‌న‌ద‌ర్శ‌క‌త్వంః మాదాల కోటేశ్వ‌ర‌రావు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved