pizza
Manyam Puli teaser launch
`మ‌న్యం పులి` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 November 2016
Hyderaba
d

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన పులి మురుగ‌న్ చిత్రాన్ని తోమిచ‌న్ ముల్క‌పాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై `మ‌న్యం పులి` పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.మ‌ల‌యాలంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్ లో 'పులిమురుగన్' రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమాను డిసెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా....

సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``పులిమురుగ‌న్ మ‌ల‌యాళంలో 125 కోట్ల గ్రాస‌ర్ సాధించిన చిత్రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్ చూశాను. నాకు న‌చ్చ‌డంతో సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యాను. నేను తెలుగులో సింధూర‌పువ్వు సినిమాను డ‌బ్బింగ్ చేస్తే పెద్ద స‌క్సెస్ అయ్యింది. త‌ర్వాత సాహ‌స‌ఘ‌ట్టం సినిమా కూడా డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేస్తే అది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో పులి మురుగ‌న్ సినిమాను మ‌న్యం పులి పేరుతో విడుద‌ల చేస్తున్నాను. సింధూర‌పువ్వు, సాహ‌స‌ఘ‌ట్టం సినిమాల కంటే మ‌న్యంపులి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చిత్ర‌యూనిట్ దాదాపు రెండు సంవ‌త్స‌రాల పాటు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమాను 180 రోజులు పైగా చిత్రీకరిస్తే 110 రోజులు యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రించారు. అందులో టైగ‌ర్ ఫైట్‌ను 43 రోజుల పాటు చిత్రీక‌రించారు. రేపు సినిమా సెన్సార్ జ‌రుపుకోనుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాను`` అన్నారు.

తొమిచ‌న్ ముల్క‌పాద‌మ్ మాట్లాడుతూ - ``నిర్మాత‌గా పులి మురుగ‌న్ నాకు ఐద‌వ సినిమా. అయితే ఈ చిత్రం మ‌ల‌యాళంలో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డ‌మే కాకుండా వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించిన మ‌ల‌యాళ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ముఖ్యంగా టైగ‌ర్ ఫైట్ కోసం పులి కోసం సౌతాఫ్రికా, వియ‌త్నాంలో చూశాం. అక్క‌డ చూసిన పులులేవీ మాకు న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు థాయ్‌లాండ్‌లో రెండు పులుల‌ను సెల‌క్ట్ చేసుకుని వాటితో టైగ‌ర్ ఫైట్‌ను షూట్ చేశాం. దీని కోసం మాకు 43 రోజుల స‌మయం ప‌ట్టింది. సినిమా క్లైమాక్స్ 28 నిమిషాలుంటుంది. దీన్ని 58 రోజుల్లో చిత్రీక‌రించాం. సినిమా కోసం రెండేళ్ల పాటు బాగా క‌ష్ట‌ప‌డ్డాం. మ‌ల‌యాళంలో సినిమా ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

హీరో నాగాన్వేష్ మాట్లాడుతూ - ``నాన్న‌గారికి డ‌బ్బింగ్ సినిమాలు చాలా మంచి పేరు తెచ్చాయి. ఆ అనుభ‌వంతో ఆయ‌న డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేస్తున్న మూడో సినిమా మ‌న్యం పులి. తెలుగు ఆడియెన్స్‌ను బాహుబ‌లి ఎలాగో మ‌ల‌యాళ ఆడియెన్స్‌కు పులిమురుగ‌న్ అంత పెద్ద సినిమా అయ్యింది. తెలుగులో మ‌న్యం పులి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ - ``టీజ‌ర్ చూశాను నాకు చాలా బాగా న‌చ్చింది. సినిమా పెద్ద హిట్‌కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను`` అన్నారు.

జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్‌, ఎడిటింగ్ః జాన్ కుట్టి, షిజాస్ పి.యూన‌స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ః విజ‌య్‌, స్రిస్‌, పిక్స్‌ల్‌, నిర్మాతః సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః వైశాక్‌


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved