pizza
Srirastu Subhamastu Thanks meet
`శ్రీరస్తు శుభమస్తు` సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 August 2016
Hyderaba
d

అల్లు శిరీష్‌ హీరోగా, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ప్రముఖ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు'. ఆగస్ట్ 5న ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రయూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ...

అల్లు అర్జున్ మాట్లాడుతూ ``తమ్ముడు శిరీష్‌ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని హిట్‌ చేసిన ప్రేక్షకమహాశయులకు అభినందనలు. అయితే నేనిక్కడ ఒక మాటను చెప్పటానికి వచ్చాను. అది అహంకారంతోను, మేధావితనంతోనూ చెబుతున్న మాటలుకావు. ఈ సినిమా పట్ల నేను మొదట్నుంచి చాలా పాజిటివ్‌టాక్‌తో ఉన్నాను. పరశురామ్‌ను గమనిస్తూ వస్తున్నాను. యంగ్‌ డైరెక్టర్స్‌ తమ స్పీడ్‌ను కంట్రోల్‌ చేసుకుని కథలు రాస్తే అద్భుతమైన కథలు వస్తాయి. అది నేను పరశురామ్‌లో చూశాను. ఏడాదిన్నరగా పరుశురాం, శిరీష్ ల ట్రావెలింగ్ ను గమనిస్తూ వస్తున్నాను. టైటిల్‌ వినగానే మంచి ప్లజంట్‌గా ఉందనుకున్నాను. టైటిల్‌ బాగుందంటూ కొందరు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా రెడీ అయిన తర్వాత రషెష్ చూశాను కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆ విషయాన్ని నాన్నగారితో కూడా చెప్పాను. సాధారణంగా బొమ్మరిల్లు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ చిత్రాలు చూసి నేను కూడా అలాంటి సినిమాలు చేస్తే బాగుండునే అనుకున్నాను. కానీ శిరీష్‌ ప్రారంభంలోనే అలాంటి ఒక మంచి నటించే సక్సెస్ ను అందుకున్నాడు. తను స్టార్టింగ్ లో అలీ, రావు రమేష్ వంటి సీనియర్ నటీనటుల నుండి మంచి సపోర్ట్‌ లభించింది. వారిద్దరితో శిరీష్‌ నటించడం వలన శిరీష్‌ నటనలో ఎంతో బెటర్‌మెంట్‌ను చూపాడు. ఎవరెంత కష్టపడినా సినిమా సక్సెస్ కు డైరెక్టర్‌, డైరెక్టర్‌ టీమ్‌ కారణమవుతుంది. నాకు, మా నాన్నగారికి, శిరీష్ కు ఈ సినిమా ఎంతో ప్రెస్టిజియస్. దీన్ని శిరీస్ డెబ్యూ మూవీలా భావించాం. తన కెరీర్ కు రోడ్డు లాంటి సినిమాగా అనుకున్నాం. అలాంటి బాధ్యతను చక్కగా నిర్వహించి మంచి విజయాన్ని అందించిన పరుశురాంగారికి నా స్పెషల్ థాంక్స్. తన కొడుకులకు మంచి సక్సెస్‌లు ఇస్తున్న నాన్నగారిని చూసి రేపు నా కొడుకు పట్ల ఎలా ఉండాలన్నది తెలుసుకున్నాను'` అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ `'ఇంతటి మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకమహాశయులకు, సపోర్ట్ చేసిన వారికి నా థ్యాంక్స్‌. నా కొడుకు గురించి నేను అంతగా పొగడుకోకూడదు. వాళ్లు ఎంత కష్టపడి చేస్తారో నాకు తెలుసు. మనం ఎంత కష్టపడితే ఎంత ఎత్తుకు ఎదుగుతామో చిరంజీవి గారిని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వాళ్లు కూడా కష్టపడతారని తెలుసు. శిరీష్ ఎఫర్ట్ పెడుతున్నంత కాలం తనని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.

హీరో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ `'పరశురామ్‌ను చూస్తున్నప్పుడు ఒకసారి 2015 డిసెంబర్‌లో ఒక ట్వీట్‌ చేశాను. నేను పరుశురాంగారి దర్శకత్వంలో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నానని, ఓ ఆడియెన్ ఎలా సినిమా తీయాలనుకుంటాడో అలాంటి సినిమా చేస్తున్నారని అప్పుడు చెప్పాను. ఇప్పుడు సినిమా చూస్తే అది నిజమని అందరికీ తెలిసింది. సినిమా సక్సెస్ అవుతుందని తెలుసు కానీ డైలాగ్స్‌ చెప్పటం నుంచి ఎక్స్‌ప్రెషన్స్‌ వరకు ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా నాకు 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రానికి ముందు శిరీష్‌, ఆ తర్వాత శిరీష్‌ అనేంత పేరు తెచ్చింది. నన్ను గురువులా చెక్కారు. ఈ సక్సెస్ నా తలకెక్కకుండా భవిష్యత్ లో సినిమాలు చేస్తాను. ఎందరో ఆర్టిస్టులు గీత ఆర్ట్స్‌ లో చేయాలనుకుంటారు. కొంత మందికి వీలవుతుంది, కొందరికి కాదు, కానీ నేను అరవింద్‌గారి కొడుకును కనుక గీత ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్ లో నేను చేయగలిగాను. గీతా ఆర్ట్స్ కు నాతో సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ నాలాంటి వ్యక్తికి గీతాఆర్ట్స్ లో సినిమా చేయడమెంత ముఖ్యమో తెలుసు. కాబట్టి ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేశాను. ఎన్నో హిట్‌ చిత్రాలనిచ్చిన మా బ్యానర్‌కి మా ఈ సినిమా బ్రేక్‌లా ఉండకూడదని కష్టపడి చేశాను. మంచి సినిమా చేద్దామనుకున్నాం. పరశురామ్‌గారు అలాగే మా బ్యానర్‌కు మంచి సినిమానిచ్చారు. ఇంత పెద్ద సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.

చిత్ర దర్శకులు పరశురామ్‌ మాట్లాడుతూ `'సారొచ్చారు సినిమా ప్లాప్ తర్వాత గ్యాప్‌ వచ్చింది. కథలు రాసుకుంటూనే ఉన్నాను. కానీ ఎవరూ పిలవటంలేదు. అలాంటి సమయంలో అరవింద్‌గారు పిలిచి శిరీష్‌కు ఒక కథ చెప్పమన్నారు. అంత పెద్ద వ్యక్తి నన్ను పిలిచి సినిమా చేయమని అడగటం ఆశ్చర్యమేసింది. ముందు లైన్‌ చెప్పాను. శిరీష్ తో సినిమా చేయాలి ఎలా చేస్తావో అన్నారు. అరవింద్ లాంటి పెద్ద వ్యక్తి పిలిచి నన్ను సినిమా చేయమన్నప్పుడు నేను హిట్ సినిమా చేయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండటం వేస్ట్ అనుకుని కసితో చేసిన సినిమా ఇది. అలాగే సినిమా పూర్తయిన తర్వాత, రిలీజ్ ముందు ఐదారు రోజుల వరకు నాకు నిద్రపట్టలేదు. సినిమా చూసిన బన్నీ ఫోన్‌ చేశాక హాయిగా నిద్రపోయాను. అంతటి ధైర్యాన్నిచ్చినందుకు బన్నికి థాంక్స్. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఆడియన్స్‌ నుండి కూడా అదే ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. సాధారణంగా సినిమా రిలీజ్‌ అయ్యాక, హిట్‌ అయితే మరో సినిమా చేయండని అంటారు. కానీ 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం రిలీజ్‌ కావడానికి 40 రోజుల ముందే మరో సినిమా చేయమని అరవింద్‌గారు అడిగారు. అది ఆయన గొప్పతనం. నేను ఆయన్ను పొగడటం లేదు కానీ నాపై ఆయనకున్న నమ్మకానికి సమాధానమే ఈ సినిమా`` అన్నారు.

ఈ కార్యక్రమంలో అలీ, రావు రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు తదితరులు పాల్గొని చిత్రయూనిట్ కు అభినందనలు తెలియజేశారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved