pizza
Soggade Chinni Nayana Thank You Meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 January 2015
Hyderabad

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నెంబర్ వన్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది - అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 15న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో మా సినిమా నెంబర్ వన్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. దసరా బుల్లోడు సినిమా 1971లో విడుదలైంది. అటువంటి స్టయిల్ లో ఓ సినిమా చేయాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ఆ కోరిక ఈ సినిమాతో తీరిపోయింది. బంగార్రాజు గెటప్ కోసం అందుకే నాన్నగారు దుస్తులు, వాచ్, చైన్ అన్నీ వేసుకున్నాను. నాన్నగారు చివరి చిత్రం మనం ఆయనకెంతో ఇష్టమైంది. ఆ సినిమాను కోసం వేసిన మనం సెట్స్ లోనే ఈ సినిమాను కూడా చిత్రీకరించాం. అందుకేనేమో నాన్నగారు ఆశీర్వాదం ఈ సినిమాకు కూడా దొరికింది. మనం సినిమా 600 థియేటర్స్ లో విడుదలైతే, ఈ సినిమా పోటీ ఎక్కువగా ఉండటంతో 450 థియేటర్స్ లో విడుదలైంది. తొలి రోజు 5 కోట్లు, రెండో రోజు 5 కోట్లు, మూడో రోజు 5 కోట్ల షేర్ ను సాధించి కలెక్షన్స్ పరంగా నాచిత్రాలన్నింటిలో ఎక్కువగా షేర్ ను మూడు రోజుల్లో సాధించింది. అయితే నేను ఈ రికార్డులను పట్టించుకోను. ఎందుకంటే నాన్నగారు నటించిన మాయాబజార్, ప్రేమాభిషేకం సినిమాలైనా, నేను నటించిన శివ, నిన్నే పెళ్ళాడతా సినిమాలను రికార్డులతో ముడిపెట్టి చూడలేం కదా. ఈ సినిమాకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. బంగార్రాజు క్యారెక్టర్ కంటే రాము పాత్ర చేయడం కష్టమైంది. ఎందుకంటే సాధారణంగా నేను ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూసి మాట్లాడుతాను. కానీ రాము పాత్ర చేసేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడకూడదు. దాంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. రమ్యకృష్ణతో చాలా సినిమాల్లో కలిసి నటించాను తను మా ఫ్యామిలీ మెంబర్ తో సమానం. ఇక లావణ్యతో నేను నటిస్తున్నాననగానే అసలు వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందోనని అందరూ అనుకున్నారు. మేం కూడా ఫోటో షూట్స్ అన్నీ చేసుకునే ఓకే అనుకున్న తర్వాతే సెట్స్ లోకి వెళ్ళాం. తనతో నేచురల్ గా నటించాను. ఈ సినిమా టైంలోనే అనూప్ అమ్మగారు చనిపోయారు. కానీ అనూప్ నాలుగో రోజు నుండే ఈ సినిమా కోసం పనిచేశాడు. తన వర్క్ తో తన అమ్మకు అనూప్ నివాళి అందించాడు. కళ్యాణ్ కృష్ణ నెలరోజుల్లోనే రాంమోహ్మన్ గారు ఇచ్చిన కథను రెడీ చేసి ఒక మంచి చిత్రాన్ని ఇచ్చాడు. తనతో రెండో చిత్రాన్ని కూడా మా బ్యానర్ లోనే చేస్తున్నాం’’ అన్నారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘’బంగార్రాజు వంటి క్యారెక్టర్స్ మనం ప్రతి పల్లెటూర్లో గమనించవచ్చు. నేను నిజజీవితంలో గమనింన వ్యక్తుల నుండి నాగార్జున గారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాను’’ అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘’మనం తర్వాత నాగార్జునగారితో చేసిన ఈ సినిమా సక్సెస్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా మ్యూజిక్ ను మా అమ్మగారికి అంకితం ఇవ్వడం హ్యపీగా ఉంది’’ అన్నారు.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘’నాగార్జున వంటి సీనియర్ హీరోతో కలిసి వర్క్ చేసిన ప్రత మూమెంట్ ను బాగా ఎంజాయ్ చేశాం. నాగ్ సార్, రమ్యకృష్ణగారితో కలిసి నటించడం మంచి ఎక్స్ పీరియెన్స్ వచ్చింది’’ అన్నారు.

 




Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved