pizza
Masakkali trailer launch
'మసక్కలి' ట్రైలర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

14 February 2018
Hyderabad

సాయిరోనక్‌, శ్రావ్య, శిరీష వంక హీరో హీరోయిన్లుగా డు గుడ్‌ ఫాలో రైట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'మసక్కలి'. నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో...

తమారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ''కథలను వింటుంటే కొన్నింటిని నమ్ముతాం.. కొన్నింటిని నమ్మలేం. కొన్నింటిని నిజంగా చూసినా నమ్మలేం. నమ్మలేని కథలు నిజమైతే అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఓ కథతో రూపొందుతోన్న చిత్రమే 'మసక్కలి'. ట్రైలర్‌లోని డైలాగులు చాలా బావున్నాయి. మంచి లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ సినిమాలో 'ఒక్క క్షణం' అనే సాంగ్‌ నా ఫేవరేట్‌. ఈ సినిమాలో పాజిటివిటీ ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి.. మంచి రిలీజ్‌ డేట్‌ చూసుకుని రిలీజ్‌ చేయాలని నిర్మాతలకు చెబుతున్నాను'' అన్నారు.

మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ''సినిమా యూనిట్‌ పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. సినిమా మంచి విజయాన్ని సాధించి యూనిట్‌కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు నబి ఏనుగుబల(మల్యాల) మాట్లాడుతూ - ''ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమే ఇది. అందుకనే మసక్కలి అనే టైటిల్‌ను పెట్టాం. ప్రతి పాట, డైలాగ్‌ వెనుక బలమైన కథ ఉంటుంది. మంచి ఎమోషనల్‌, క్లీన్‌, లవ్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాం. మిహిరామ్‌ మంచి సంగీతాన్ని అందించారు'' అన్నారు.

చిత్ర నిర్మాత సుమిత్‌ సింగ్‌ మాట్లాడుతూ - '''మసక్కలి' చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథ. మా బ్యానర్‌లో రూపొందుతున్న తొలి చిత్రమిది. దర్శకుడు నబి ఏనుగుబల సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం విజువల్‌గా ఫ్రెష్‌ ఫీల్‌నిస్తుంది. మిహిరామ్స్‌ సంగీతం, సుభాష్‌ దొంతి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది. మ్యూజికల్‌గా సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాగే అదుÄతేమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కుదిరింది. సాయిరోనక్‌, శ్రావ్య, శిరీష వంక తెరపై చూడ చక్కగా ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్రకు చాలా ముఖ్యత్వం ఉంటుంది. సినిమాను చూసే ఆడియెన్స్‌ మంచి అనుభూతికి లోనవుతారు. ఈ నెలలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అని తెలిపారు.

సాయిరోనక్‌, శ్రావ్య, శిరీష వంక, కాశీ విశ్వనాథ్‌, నవీన్‌ నేని, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః శివ శర్వాణ, సంగీతంః మిహిరామ్స్‌, సినిమాటోగ్రఫీః సుభాష్‌ దొంతి, నిర్మాతః సుమిత్‌ సింగ్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః నబి ఏనుగుబల(మల్యాల).




 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved