pizza
Rakshaka Bhatudu trailer launch
`ర‌క్ష‌క‌భ‌టుడు` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 March 2017
Hyderaba
d

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో లెవ‌రూ లేక‌పోవ‌డ‌మే..కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా....

`మా` అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ - ``ఈ ర‌క్ష‌కభ‌టుడు సినిమాకు ఆ ఆంజ‌నేయ స్వామి ర‌క్ష ఎప్పుడూ ఉంటుంది. గురురాజ్ న‌టుడుగా సినిమా రంగంలోకి వ‌చ్చాడు. కానీ ఇప్పుడు నిర్మాత‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత‌గా గురురాజ్ హీరోలా నిల‌బ‌డాల‌ని కోరుకుంటున్నాను. గురురాజ్‌కు సినిమాలంటే ఎంతో ప్యాష‌న్ ఉంది. ఇలాంటి ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తికి అంత కంటే సినిమాలంటే ప్యాష‌న్ ఉన్న మ‌రో వ్య‌క్తి వంశీకృష్ణ క‌లిశాడు. వీళ్ళిద్ద‌రూ క‌లిసి చేసిన ర‌క్ష‌క‌భటుడు సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ - ``సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌బోతున్నాం. సినిమాను అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేయ‌డానికి యూనిట్ స‌భ్యులంద‌రూ రాత్రి ప‌గ‌లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నా ర‌క్ష‌, జ‌క్క‌న్న చిత్రాలకంటే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. యూనిట్ అంతా ఒక కుటుంబంలా క‌లిసిపోయి త‌మ సినిమాగా భావించి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. నిర్మాత గురురాజ్ గారు కుటుంబ పెద్ద‌లా సినిమా బాగుండాల‌ని కోరుకున్నారు. ట్రైల‌ర్‌లో మీరు చూసిన దాని కంటే ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ సినిమాలో ఉంది. సినిమా ఓ స్టైలిష్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చి సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Richa Panai Glam gallery from the event

నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - `నేను న‌టుడుగా ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేసి స‌ఫ‌లం కాలేక‌పోయాను. ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాను. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషిగారు ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. అలాగే డ్రాగ‌న్ ప్ర‌కాష్‌గారు ఎక్స‌లెంట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. రిచా ప‌న‌య్ లేడీ టైగ‌ర్‌లా సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి స‌పోర్ట్ చేసింది. ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు చేసిన ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేసిన మూడో సినిమా ఇది. క‌థే హీరోగా రూపొందిన ఈ సినిమా అవుట్‌పుట్ బావుండాల‌ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా క‌ష్ట‌ప‌డ్డాం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

కె.ఎల్‌.గ్రూప్ ఛైర్మ‌న్ నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ - ``క‌థ విన‌గానే అందులో పాయింట్ నాకు బాగా న‌చ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆనాడే ఉహించాను. ఇప్పుడు ట్రైల‌ర్ చూస్తుంటే, నా న‌మ్మ‌కం నిజ‌మవుతుంద‌ని భావ‌న ఇంకా బ‌ల‌ప‌డింది. ప‌క్కా హిట్ మూవీ ర‌క్ష‌క‌భ‌టుడు`` అన్నారు.

శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ``క‌థ విన‌గానే చాలా ఎగ్జ‌యిట్ అయి సినిమా చేశాను. ఇందులో ఒకే ఒక పాట ఉంటుంది. మంచి సూప‌ర్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది`` అన్నారు.

మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి మాట్లాడుతూ - ``సినిమా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. అవ‌కాశం ఇచ్చిన వంశీకృష్ణ‌, గురురాజ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

రిచా ప‌న‌య్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో న‌టించ‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గురురాజ్‌గారు, వంశీకృష్ణ‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేష‌న్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాంజ‌గ‌న్‌, అదుర్స్ ర‌ఘు, కృష్ణేశ్వ‌ర్‌, ధ‌న‌రాజ్‌, జ్యోతి, ఎడిట‌ర్ అమ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌, నందు, చిత్రం శ్రీను,స‌త్తెన్న‌, జ్యోతి, కృష్ణేశ్వర్‌రావు, మ‌ధు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయ‌ర్‌, ఎడిటింగ్ః అమ‌ర్ రెడ్డి, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,నిర్మాణ‌, నిర్వ‌హ‌ణః జె.శ్రీనివాస రాజు, ప్రొడ్యూస‌ర్ః ఎ.గురురాజ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ ఆకెళ్ల‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved