pizza
Sriramudinta Srikrishnudanta trailer launch
`శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట‌` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

03 May 2017
Hyderabad

శేఖ‌ర్ వ‌ర్మ‌, దీప్తిశెట్టి హీరో హీరోయిన్లుగా గాయ‌త్రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ఫై న‌రేష్.పి ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎన్‌.రావు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట‌`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు న‌రేష్.పి మాట్లాడుతూ - ``విలేజ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. చిన్న ఫ్యామిలీలో ఎలాంటి ఎమోష‌న్స్ ఉన్నాయ‌నే దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు మ్యూజిక్ కూడా నేనే చేశాను. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 19న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

నిర్మాత కె.ఎన్‌.రావు మాట్లాడుతూ - ``నేను ఈ సినిమాకు అనుకోకుండా నిర్మాత‌గా మారాను. ద‌ర్శ‌కుడు న‌రేష్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి వెంట‌నే అంగీక‌రించాను.సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. టైటిల్‌ ఎంతగా ఆకట్టుకుంటున్నదో అలానే కథ, స్క్రీన్‌ప్లే కూడా చాలా బావుంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ కథాంశంతో ఉంటుంది. సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా పెద్ద హిట్ సాధించి మా టీంకు మంచి పేరు తెస్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

Deepthi Shetty Glam gallery from the event

హీరో శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ - ``సినిమా పాట‌లు విన్న‌వారంద‌రూ అన్నీ పాట‌లు బావున్నాయని అంటున్నారు. పాట‌లు హిట్ కావ‌డంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని అంద‌రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మే 19న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ఆద‌రించాలని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాం`` అన్నారు.

హీరోయిన్ దీప్తి శెట్టి మాట్లాడుతూ - ``విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోసాగే ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మధుసూదన్‌, మధుమణి, గౌతంరాజు, గీతాంజలి, రామరాజు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: కూనపరెడ్డి జయకృష్ణ, ఎడిటింగ్‌: సుంకర ఎస్‌.ఎస్‌., నిర్మాణ నిర్వహణ: కె.ఆర్‌.ప్రశాంత్‌, రచన, సంగీతం, దర్శకత్వం: నరేష్‌ పెంట.

 

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved