pizza
Suryasthamayam trailer launch
`సూర్యాస్త‌మ‌యం` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us



26 December 2018
Hyderabad

సినిమా అంటేనే 24 శాఖ‌ల స‌మ్మేళ‌నం. ఒక సినిమా త‌యారు కావాలంటే ఎంతో మంది వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకే వ్య‌క్తి ఎక్కువ శాఖ‌లు నిర్వ‌హించి సినిమా చేయ‌డ‌మ‌నేది సినిమా చ‌రిత్ర‌లో చాలా అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతూ ఉంటుంది. తాజాగా అలాంటి అరుదైన ఫీట్ చేశారు బండి స‌రోజ్ కుమార్‌. `సూర్యాస్త‌మ‌యం` అనే చిత్రం కోసం ఆయ‌న 11 శాఖ‌లు నిర్వ‌హించారు. ఆ చిత్రానికి ఆయ‌నే స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్‌, డైలాగ్ రైట‌ర్‌, లిరిక్ రైటర్ , ఎడిటర్ , మ్యూజిక్ డైరెక్టర్ , స్టంట్ మాస్ట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌రియు డైర‌క్ట‌ర్‌. అంతే కాదు ఆ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారి కూడా. ఓజో మీడియా ప‌తాకంపై ర‌ఘు పిల్లుట్ల‌, ర‌వికుమార్ సుద‌ర్శి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫ‌స్ట్ కాపీ కూడా సిద్ధ‌మైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్మాత డి.సురేష్ బాబు విడుద‌ల‌ చేశారు. ఈ సంద‌ర్భంగా....

డి.సురేష్ బాబు
మాట్లాడుతూ - ``ప‌దేళ్ల‌క్రితం బండి స‌రోజ్ కుమార్ న‌న్ను క‌లిశారు. ఓ క‌థ చెబితే అందులో చిన్న చిన్న మార్పులు చెప్పాను. కానీ త‌ను కామ్‌గా వెళ్లిపోయి ఆ క‌థ‌ను త‌మిళంలో చేసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. త‌ను నాకు బాగా గుర్తుండిపోయాడు. ఇప్పుడు త‌ను ఫోన్ చేసి సినిమా చేశాను చూడ‌మ‌ని చెప్ప‌గానే చూశాను. త‌ను ఓ హీరో అని అనుకోలేదు. అంత కొత్త‌గా క‌న‌ప‌డ్డాడు. అలాగే సినిమాలో 11 శాఖ‌ల ప‌నులు త‌నొక్క‌డే చేశాడు. త‌న‌కు ఆ కెపాసిటీ ఉంద‌ని తెలుసు. త‌న‌కి, టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

హీరోయిన్ హిమాన్సీ కాట్ర‌గ‌డ్డ మాట్లాడుతూ - ``నా తొలి సినిమా. నా డెబ్యూ సినిమా ఇది అని గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. అంద‌రం దాదాపు కొత్త‌వాళ్లే న‌టించాం. నేచుర‌ల్‌, రియ‌లిస్టిక్ మూవీ`` అన్నారు.

త్రిశూల్ రుద్ర మాట్లాడుతూ - ``సినిమాలో వ‌న్ ఆఫ్ ది లీడ్‌గా న‌టించాను. సినిమా చూశాను. చాలా హ్యాపీగాక‌, ప్రౌడ్‌గా ఉంది`` అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ - ``నిర్మాత‌లుగా తొలి చిత్రం. స‌రోజ్‌కుమార్ మా సీనియ‌ర్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేశాం. నిర్మాత‌లుగా మా తొలి ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

బండి స‌రోజ్ కుమార్ మాట్లాడుతూ - ``ప‌దేళ్ల వ‌యసు నుండి సినిమాలు చేయాల‌నుకునే నేర‌వేర్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాను. నాకు చ‌దువు నేర్పిన గురువులు నాకు స్ఫూర్తి నింపితే.. నేను తెలుగు ఇండ‌స్ట్రీలో కలిసిన సురేష్‌బాబుగారు కూడా నాకు సినిమా అంటే క‌ళ మాత్ర‌మే కాదు.. బాధ్య‌త కూడా అని చెప్పారు. నా సినిమాను చూసిన ఏకైక వ్య‌క్తి కూడా ఆయ‌నే. నిర్మాత‌గా నా సినిమాకు పాస్ మార్కులు ఇచ్చారు. రెండు ద‌శాబ్దాల పాటు గుర్తుండిపోయే రెండు గంట‌ల సినిమా అని న‌మ్మ‌కంగా చెబుతున్నాను`` అన్నారు.

త్రిశూల్ రుద్ర‌, హిమాన్సీ కాట్ర‌గ‌డ్డ‌, బండి సరోజ్ కుమార్, కావ్యా సురేష్‌, డేనియ‌ల్ బాలాజీ, మాస్ట‌ర్ అక్షిత్‌, మాస్ట‌ర్ చ‌ర‌ణ్ సాయికిర‌ణ్‌, బేబీ శ‌ర్వాణీ, మోహ‌న్ సేనాప‌తి, వివేక్ ఠాకూర్‌, సాయిచంద్‌, కేకే బినోజీ, ప్రేమ్‌కుమార్ పాట్రా, షానీ, వంశీ ప‌స‌ల‌పూడి, శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు ఈ చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం.
ఈ చిత్రానికి డీటీయ‌స్ మిక్సింగ్‌: వాసుదేవ‌న్‌, డీ ఐ క‌ల‌రిస్ట్: ఎం. మురుగ‌న్‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved