pizza
Veedevadu trailer launch
`వీడెవ‌డు` టీజ‌ర్ విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 March 2017
Hyderaba
d

A hero, fighter, player, traitor, or killer, who is he? This is the premise of Sachiin Joshi’s next movie, Veedevadu, where he plays a Kabaddi player who is accused of murdering his girlfriend.

The gripping teaser that released today has successfully managed to capture the audience’s interest.

The movie is directed by Tatineni Sathya of Bheemilli Kabaddi Jattu and SMS fame, and the music is composed by popular Telugu composer SS Thaman. Esha Gupta plays the female lead in the movie. Actors Prabhu, Satish, Vennela Kishore, Dhanya Balakrishnan, and Kishore Kumar are a prominent part of the movie.

This intense action thriller is scheduled to hit the screens this May. Will the movie turn out to be as interesting as the teaser? We can’t wait to find out!

`వీడెవ‌డు` టీజ‌ర్ విడుద‌ల

స‌చిన్‌, ఇషా గుప్తా హీరో హీరోయిన్లుగా వై కింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రైనా జోషి నిర్మిస్తోన్న చిత్రం `వీడెవ‌డు`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా....

డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ మాట్లాడుతూ - ``టీజ‌ర్ చాలా బావుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని రేకెతిస్తుంది. స‌చిన్‌గారు ఎంతో న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. ద‌ర్శ‌కుడు స‌త్య సినిమాను తెర‌కెక్కించిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు తెలియజేశాను`` అన్నారు.

సాజి డిసౌజా మాట్లాడుతూ - ``నేను బేసిక్‌గా డాక్ట‌ర్ అయినా, మల‌యాళంలో ప‌లు చిత్రాల్లో న‌టించాను. వీడెవడు చిత్రంలో కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాను. అద్భుత‌మైన క‌థ‌. వండ‌ర్‌ఫుల్ ఎగ్జిక్యూష‌న్‌. స‌చిన్ అమేజింగ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. సీట్ ఎడ్జ్ మూవీలా ద‌ర్శ‌కుడు స‌త్య సినిమాను తెర‌కెక్కించారు`` అన్నారు.

ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య మాట్లాడుతూ - ``ఎస్‌.ఎం.ఎస్‌, భీమిలి క‌బ‌డ్డీ జట్టు, శంక‌ర సినిమాలు అన్నీ రీమేక్ చిత్రాలే. నేను తెలుగులో చేసిన స్ట్ర‌యిట్ మూవీ వీడెవ‌డు.బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్ర‌ఫీ, థ‌మ‌న్ మ్యూజిక్‌, ర‌ఘు కుల‌క‌ర్ణి ఆర్ట్‌, స‌హా అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. స‌చిన్ జోషిగారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెలాఖ‌రున విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

స‌చిన్‌జోషి మాట్లాడుతూ - ``వీడెవ‌డు సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. సినిమా కోసం ప‌నిచేసిన వారంద‌రూ ప్యాష‌న్‌తో వ‌ర్క్ చేశారు. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చింది. అలాగే సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌ఘుకుల‌క‌ర్ణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శివ‌ప్ర‌సాద్ గుడిమిట్ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌చిన్‌, ఇషా గుప్తా, ప్ర‌భు, కిషోర్‌, సుప్రీత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః బినేంద్ర మీన‌న్‌, సంగీతంః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, ఎడిటింగ్ః ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి, ఫైట్స్, క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, పాట‌లుః రామ‌జోగ‌య్య‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణి, కొరియోగ్ర‌ఫీః సీజ‌ర్‌, జానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శివ‌ప్ర‌సాద్ గుడిమిట్ల‌, ప్రొడ్యూస‌ర్ః రైనా జోషి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః తాతినేని స‌త్య‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved