pizza
Aranyamlo trailer launch
`అర‌ణ్యంలో` టీజ‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

06 August 2016
Hyderaba
d

వ‌న్‌మ్యాన్ క్రియేష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన చిత్రం `అర‌ణ్యంలో`. షాలు, శ్రావ‌ణి, విక్టోరియా, చ‌ర‌ణ్ నాయుడు, రోహిత్‌,క‌రుణాక‌ర్‌, క‌ల్యాణ్‌, న‌వీన్‌, గోపాల్‌, శివ‌, ల‌క్ష్మి, సంజ‌య్‌కుమార్‌, మోహ‌న్‌, శ్రీను కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాను సుద‌ర్శ‌న్‌రెడ్డి పాల్వాయ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. ఈ చిత్రం టీజ‌ర్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్లో విడుద‌ల చేశారు.

ద‌ర్శ‌క‌నిర్మాత మాట్లాడుతూ ``కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నాల‌జీతో చేశాం. కొత్త స్టోరీ, కొత్త స్క్రీన్‌ప్లే అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది`` అని అన్నారు.\

అజ‌య్ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``నా వ‌ర‌కు నేను సినిమాకు న్యాయం చేశాన‌నే అనుకుంటున్నాను`` అని అన్నారు.

చ‌ర‌ణ్ నాయుడు మాట్లాడుతూ ``నా డెబ్యూ సినిమా ఇది. అర‌ణ్యంలో కూడా ఓ సంస్కృతి ఉంటుంది. అదేంటి? అమ్మాయిల‌ను చుల‌క‌న‌గా చూసేవారికి ఎలాంటి ప‌రిస్థితి ఎదురైంది? అనేది ఈ సినిమాలో కీల‌కం`` అని చెప్పారు.

న‌వీన్ మాట్లాడుతూ ``కొత్త‌వాళ్ల‌మైనా క‌ష్ట‌ప‌డి చేశాం. మంచిప్రాజెక్ట్ అవుతుంది`` అని అన్నారు.

క‌రుణాక‌ర్ మాట్లాడుతూ ``థియేట‌ర్లో చూడ్డానికి ఈ సినిమా చాలా బాగా ఉంటుంది`` అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: స‌ంతోష్ రెడ్డి పాల్వాయ్‌, క‌థ‌: భ‌ర‌త్ ప‌ల్ల‌పోలు, సంగీతం: అజ‌య్ ప‌ట్నాయ‌క్‌.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved