pizza
Plus 1 trailer launch
`ప్ల‌స్ వ‌న్` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

7 December 2016
Hyderaba
d

సుచేతా డ్రీమ్‌వ‌ర్క్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ప్ల‌స్ వ‌న్‌`. రోష‌న్ క‌థానాయకుడు. ఆర్తి నాయిక‌. అళ‌హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విశ్వాస్.హెచ్ నిర్మాత‌. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సి.క‌ల్యాణ్ పాల్గొని ట్రైల‌ర్‌ని విడుదల చేశారు.

అళ‌హ‌రి మాట్లాడుతూ ``స్వీట్ 16 ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించాం. ప్రేమ‌లేని ప్రేమ క‌థ ఒక వైపు ఉంటుంది. మ‌రో వైపు ప్రేమ ఉంటుంది. ఈ రెండు అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాం. తెలియ‌క చేసిన పొర‌పాటు వ‌ల్ల త‌ప్పుని ఒప్పుగా చేసుకోవడానికి జంట ఏం చేశార‌నేది క‌థాంశం. యువ‌త‌ను, త‌ల్లిదండ్రుల్ని కూడా ఆక‌ట్టుకుంటుంది`` అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ ``యువ‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే చిత్ర‌మిది. ప్ల‌స్ ఒన్ ఏజ్‌లో యువ‌త మెంట‌ల్లీ, సైక‌లాజిక‌లీ ఎలా ఉంటుందనేది ఇందులో చూపించాం. న‌ల్గొండ‌లో సినిమాను పూర్తి చేశాం`` అని చెప్పారు.

Glam galleries from the event

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ``మా అళ‌హ‌రి ఈ సినిమాలో న‌టించారు. ఎమ్మెస్ నారాయ‌ణ‌లాగా ఇత‌ను కూడా మంచి న‌టుడు కావాలి`` అని తెలిపారు.

తేజారెడ్డి, పూర్ణిమ‌, స‌ర‌యు, ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌,వి.ఆర్‌, స‌యుదుల్ గౌడ్‌, రావుశ్రీ, అళ‌హ‌రి, మాస్టర్ శ్రీరామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: న‌ర్సింగ‌రావు య‌మ్‌., మాట‌లు: గోపీకిర‌ణ్‌, ముర‌ళీకృష్ణ‌, డ్యాన్స్: ప్రేమ‌ల‌త‌, ఎడిటింగ్‌: లోకేశ్‌, సంగీతం: జ‌య‌సూర్య‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved