pizza
Trivikraman Trailer Launch
'త్రివిక్రమన్‌' ట్రైలర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 August 2016
Hyderaba
d

అమీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రవిబాబు, నాగబాబు, శ్రీహర్ష(ఈరోజుల్లో), ప్రవీణ్‌రెడ్డి అమూల్యరెడ్డి, సన, షాలిని ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'త్రివిక్రమన్‌'. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. సినిమా బ్యానర్‌ లోగోను తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టైటిల్‌ లోగోను చినబాబు, థియేట్రికల్‌ ట్రైలర్‌ను రఘురామ కృష్ణంరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా...

రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ - ''క్రాంతికుమార్‌ దర్శకుడు కాముందు నుండే నాకు తెలుసు. ఒకరోజు నన్ను కలిసి సినిమా చేశాను సార్‌..అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. తన ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. చాలా ప్యాషన్‌తో తను సినిమా చేశాడు. క్రాంతికుమార్‌ చిన్న ప్రయత్నం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

చినబాబు మాట్లాడుతూ - ''దర్శకుడు క్రాంతికుమార్‌ అండ్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''ఈ సినిమా ప్రారంభం నుండి నాకు ప్రతి విషయాన్ని దర్శకుడు తెలియజేస్తూనే ఉన్నాడు. ట్రైలర్‌ చాలా బావుంది. దర్శక నిర్మాతగా క్రాంతి పడ్డ కష్టం తెలుసు. ఈ సినిమా విడుదల సమయంలో థియేటర్స్‌ సమస్య రాకుండా నేను సహకరిస్తాను'' అన్నారు.

శ్రీ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నన్ను నటించమని దర్శకుడు అడిగినప్పుడు ఆలోచించాను. కానీ సినిమాలో చాలా కీలకపాత్ర అని తెలియగానే ఒప్పుకున్నాను. ఈ సినిమాలో త్రివిక్రమన్‌ అనే రాజు పాత్రలో కనపడతాను'' అన్నారు.

రుంకి గోస్వామి మాట్లాడుతూ - ''సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి దర్శక నిర్మాతలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి'' అన్నారు.

దర్శక నిర్మాత క్రాంతికుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా మేకింగ్‌లో ఇక ముందుకు వెళ్ళలేం అనుకునే సమయంలో కస్తూరి శ్రీనివాస్‌గారి సహకారంతో సహ నిర్మాత రామకృష్ణారావుగారు పరిచయం అయ్యారు. అక్కడి నుండి రామకృష్ణారావుగారే నన్ను ముందుకు నడిపించారు. సినిమా ఈ స్థాయికి చేరుకుందంటే ఆయనే కారణం. సినిమా గొప్ప సినిమా అవుతుందని, కాదని చెప్పలేను కానీ హండ్రెడ్‌ పర్సెంట్‌ అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో కస్తూరి శ్రీనివాస్‌, హర్షవర్ధన్‌.టి, బోలే, తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

ఈ చిత్రానికి ఆర్ట్‌: శ్రీనివాస్‌, రీ రికార్డింగ్‌: బోలే, సంగీతం: రుంకి గోస్వామి, ఎడిటింగ్‌: సునిల్మహరణ, ఫోటోగ్రఫీ: నాగార్జున-సునీల్‌బాబు, రచనా సహకారం: టి.హర్షవర్ధన్‌, కథ: చెరకు - బత్తుల, దర్శకత్వ పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్‌, సహ నిర్మాత: తోటకూర రామకృష్ణారావు, నిర్మాత,దర్శకత్వం: క్రాంతికుమార్‌.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved