pizza
Maharshi Vijayotsavam at Vijayawada
నా బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ ని ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసేంతటి ఘన విజయాన్ని 'మహర్షి' కి అందించిన మీ అభిమానానికి సలాం - 'మహర్షి' విజయోత్సవం లో సూపర్ స్టార్ మహేష్
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 May 2019
Hyderabad

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయ్యి మహేశ్ బాబు గత చిత్రాల. రికార్డు లని తిరగరాసే విధంగా భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది..ఈ సందర్భంగా మే 18న విజయవాడ లో మహర్షి విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ ని మేమంటో లతో సత్కరించారు..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ఇవ్వాల సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద పండుగ రోజు. అలాగే మహేశ్ కి 25వ సినిమా కాబట్టి ఇది 25వ పండుగ.ముందుగా త్రిమూర్తులు అయిన దిల్ రాజు, పి వి పి, మా బావ దత్ ని ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మహేశ్ మీ నాన్న గారు 20 సంవత్సరాల సందర్భంగా నిన్ను చూసి ఎంత సంతోష పడుతున్నారో...నీ 25వ సినిమా చూసి నేను 100 సినిమాలు తీసినప్పుడు ఎంత సంతోష పడ్డానో అంత సంతోష పడుతున్నాను. చాలా గర్వం తో ఉన్నాను. వంశీ నువ్వు చేసిన ప్రయత్నం ఒక హీరో కే కాకుండా మొత్తం సొసైటీ కి అందరికీ ఉపయోగపడే విధంగా మహేశ్ నీ రిషి గా మహర్షి గా చాలా బాగా చూపించావు. ఆఖరికి రైతు బాగుంటేనే మనం బాగుంటాము అని ఇంకా అద్భుతంగా చూపించా వు. పూజని నేను కలిసిన మొదటి రోజే చెప్పాను చాలా పెద్ద స్టార్ అవుతావు అని. నరేష్ మీ నాన్న గారు ఉంటే నీ క్యారెక్టర్ ని చూసి చాలా సంతోషించే వారు. మహేశ్ ఫస్ట్ పిక్చర్ 'రాజ కుమారుడు' సినిమాను సూపర్ స్టార్ కృష్ణ గారు మా బావ దత్ గారి బేనర్ లో చేయమంటే ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.మహేశ్ నిన్ను ఇండస్ట్రీ కి పరిచయం చేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏప్రిల్ 28 న అడవి రాముడు, పోకిరి, బాహుబలి విడుదలై రికార్డులను సాధించాయి. అలాగే మే 9 నాది మరియు దత్ గారి కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సుందరి, దత్తు వారి అల్లుడు అశ్విన్ కాంబినేషన్ లో మహానటి సినిమాలు మే 9 విడుదలై సూపర్ హిట్స్ సాధించాయి. అలానే మహర్షి కూడా మే 9 నే విడుదలై ఇంత పెద్ద విజయం సాధించింది కాబట్టి ఇకనుండి మే 9 ని మహర్షి డే గా పిలవాలి. మహేశ్ జర్నీ ఇంతటితో ఆగదు. నెక్స్ట్ దిల్ రాజు అనిల్ రావిపూడి సినిమా ఇంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది" అన్నారు.

మెగా మేకర్ అశ్విని దత్ మాట్లాడుతూ - " మా కృష్ణ గారి అభిమానులకు, సూపర్ స్టార్ మహేష్ అభమానులకు మహేశ్ మొదటి సినిమా రాజకుమారుడు ఈ విజయవాడలో అలంకార్ థియేటర్ లో నాలుగు షోస్ ఫుల్ గా 100 రోజులు ఆడి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. మళ్లీ నా ఇద్దరి సోదరులతో కలిసి తీసిన ఈ మహర్షి సినిమా ఇటు ఇండియాలో అటు అమెరికాలో కూడా సరి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మాకు ఇంత గొప్ప సినిమా ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ కి , వంశీ కి , నరేష్ , పూజా మిగతా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు" అన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - "ఇద్దరు విజయవాడ టైగర్స్ మధ్య ఈ సినిమాను రెడీ చేసి మీ ముందుకు తీసుకు వచ్చాం. మే ము ముగ్గురం కలిసి మహేశ్ బాబు గారి 25వ సినిమా నిర్మించడం నిజంగా మా అందరికీ చాలా హ్యాపీ మూమెంట్. ఎన్ని సినిమాలు వచ్చినా..ఎన్ని సక్సెస్ లు వచ్చినా కొన్ని మాత్రమే గుర్తుంటాయి..మా అందరికీ మహర్షి అలాంటిదే.మహేశ్ బాబు గారి రాజకుమారుడు, ఒక్కడు, దూకుడు సినిమాలకు విజయోత్సవ సభలు ఇక్కడే చేశాము. ఇప్పుడు మహర్షి ద్వారా మరో సారి మిమ్మల్ని కలవడానికి ఇక్కడకు వచ్చాం" అన్నారు.

ప్రముఖ నిర్మాత పి వి పి మాట్లాడుతూ - " ముందుగా ఈ విజయోత్సవ సభలు కారణమై మమ్మల్ని అందర్నీ ఆశీర్వదించి ముందుకు నడిపిన ఆ అమ్మ వారి కి కృతజ్ఞతలు. తరువాత సూపర్ స్టార్ మహేశ్ కి కృతజ్ఞతలు. తరువాత తమ్ముడు వంశీ మహేశ్ 25 వ సినిమా ని ఒక లాండ్ మార్క్ ఫిలిమ్ లా తీర్చి దిద్దారు. మహర్షి మూవీ కాదు కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. సూపర్ స్టార్ అంటే బిరుదు మహర్షి అంటే బాధ్యత. ఇంకో 25 ఏళ్లు మహేశ్ మహర్షి లా ఉండాలని కోరుకుంటున్నా. అలానే మా ముగ్గురితో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాము" అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ - " ముందుగా నా మనసుకు దగ్గరైన ఇద్దరు హీరోలు నటించడం జరిగింది. సూపర్ స్టార్, నరేష్ లు.ఆ విషయం తెలియగానే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకున్నాను.అంతకు మించి ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా చూడగానే ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు మీ మీద రెస్పెక్ట్ వచ్చిందండి అని మహేశ్ కి మెసేజ్ పెట్టాను. రైతుల మీద మనం చూపించాలిసింది సానుభూతి కాదు రెస్పెక్ట్ అని చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ప్రొడ్యూసర్స్ కి అభినందనలు. 16 వ సినిమా మించి 26వ సినిమా ఉండాలని కోరుకుంటున్నా" అన్నారు.

వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - " ఇంత మంచి సినిమాను నిర్మించి ఇంత పెద్ద సక్సెస్ ను తెచ్చినందుకు నిర్మాతలకు కంగ్రాట్స్. ఈ సినిమా మూడు సంవత్సరాల జర్నీ అని చెప్పారు. ఇదొక మెమొరబుల్ జర్నీ. వంశీ అన్న రాసుకున్న రిషి అనే ఒక క్యారెక్టర్ ని మహేశ్ గారు తన అద్భుతమైన నటనతో ఈ రోజు ఇంత పెద్ద హిట్ కొట్టారు. నరేష్ గారూ ఆయన కెరీర్ లో ఎంతో ఇంపార్టెన్స్ క్యారెక్టర్ చేశారు. పూజ చాలా బాగుంది. గురు స్వామి గారి వెనుక నాగలి పట్టుకొని మహేశ్ వస్తుంటే అందరకీ గూస్ బమ్స్ వచ్చాయి. రైతుకు సంబంధించి రెస్పెక్ట్ తీసుకొచ్చారు. ఇక మహేష్ గారి తో నేను చేస్తున్న 26 వ సినిమా తో ఆయన్ను ఇలానే హ్యాపీగా ఉంచుతానాని కచ్చితంగా చెబుతున్నాను" అన్నారు.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ - " నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నిర్మాతలకి థాంక్స్. వంశీ రవి పాత్రకు నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు ఒక డైలాగ్ ఉంటుంది రిషి వచ్చాడంటే ఏదో ఒకటి చేస్తారని ... అవును చేశాడు ఈ సినిమాని ఎపిక్ బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమాలో ఆయన పంట ఎంత పండిందో..మా ప్రొడ్యూసర్స్ పంట కూడా అంతే పండింది"అన్నారు.

పూజ హెగ్డే మాట్లాడుతూ - " నన్ను ఇక్కడి వరకూ తెచ్చిన ప్రొడ్యూసర్స్ కి , డైరెక్టర్ కి థాంక్స్. ఈ సినిమాలో బాగం కావడం ఒక హానర్ గా ఫీల్ అవుతున్నాను. సూపర్ స్టార్ మహేష్ బాబు 25 సినిమాలో అన్ని లుక్స్ నీ చూస్తూనే ఉన్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - " ఈ సక్సెస్ నేను ముగ్గురు నిర్మాతలకి అప్ప జెప్పుతున్నాను. దత్తు గారి బ్యానర్ లో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. దిల్ రాజు గారు నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను..మీ అందరి. సపోర్ట్ తోనే నేను ఇక్కడ ఉన్నాను. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అలానే మిగతా ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. నా అన్నయ్య మహేశ్ బాబు కి నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పినట్టు ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేస్తున్నారు. మహేశ్ కూడా ఇప్పటికే రెండు సార్లు కాలర్ ఎగరేసారు. మహేశ్ గారు మీతో గడిపిన ఇన్ని రోజులు నా లైఫ్ లో మెమొరబుల్ డేస్. మనం ఈ దేశంలో ఇంత చల్లగా ఉంటున్నాం అంటే ఇద్దరి వల్లె ఒకరు బోర్డర్ లో తుపాకీ పట్టిన సైనికుడు మరొకరు పొలం లో నాగలి దింపిన రైతు. ఈ సినిమా భారత దేశం లోని రైతు లందరికీ అంకితం" అన్నారు.

సూపర్ స్టార్ మహేశ్ మాట్లాడుతూ - " ముందుగా ఇందాక ఆంధ్రా హాస్పిటల్స్ నుండి ఒకాయన వచ్చి అన్నారు పిల్లలకి సర్జరీ చేసే ముందు మీ పేరు చెబితే నవ్వుతారు అని. దీనికన్నా గొప్ప కాంప్లిమెంట్ నేను వినలేదు. అలాగే హైదరబాద్లోని హీల్ ఏ చైల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది వారు కూడా సంవత్సరానికి ఎంత మంది పిల్లలను కాపాడుతారు. మీతో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషం. విజయవాడ వచ్చి ఆ కనక దుర్గ ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు. నా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడల్లా ఆ తల్లే నన్ను ఇక్కడికి పిలుస్తది. ముందుగా మామయ్య రాఘేంద్రరావు గారికి థాంక్స్. ఎందుకంటే ఆయనతో సినిమా చేసినప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ లా చూసుకున్నారు. ఆ రోజే ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దీ.నువ్వు పెద్ద సూపర్ స్టార్ వి అవుతావు అని చెప్పారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వైజయంతి బ్యానర్, దిల్ రాజు బ్యానర్, పి వి పి బ్యానర్. ముగ్గురు కలిసి నా 25 సినిమాను ప్రొడ్యూస్ చెయ్యడం అలానే దత్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా 25 వ సినిమా కూడా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారూ, పూజ గారు అందరూ నాకు ఎప్పటికీ స్పెషల్. ఈ సినిమా డెహ్రాడూన్ లో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడే చెప్పా ఈ సినిమా పోకిరి స్క్వేర్ అవుద్ది అని. ఈ మూడు క్యారెక్టర్స్ లో స్టూడెంట్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది ఎప్పుడూ మర్చి పోలేని కిక్ ఇచ్చింది. గురు స్వామి గారి ఆశీస్సుల వల్లె ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది.ఇక నాన్న గారి అభిమానులందరూ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే....మీకు సినిమా నచ్చితే ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. కానీ నా 25వ సినిమా అన్ని బ్లాక్ బస్టర్ నీ ఒక వారంలో దాటించారు చూసారా సలాం మీ అందరికీ ..మీ గురించి నేను ఎప్పుడూ చెప్పేది చేసేది ఒక్కటే చేతులెత్తి దండం పెట్టడం. థాంక్స్" అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved