pizza
Waltair Veerayya Poonakaalu Loading song launch Sandhya 70mm
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' నాల్గవ పాట 'పూనకాలు లోడింగ్' విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 December 2022
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' నాల్గవ పాట 'పూనకాలు లోడింగ్' విడుదల

-మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య : పూనకాలు లోడింగ్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ కొల్లి

పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' లోని నాల్గవ పాటను చూడండి.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల 'పూనకాలు లోడింగ్' పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ''డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్'' అనడం పూనకాలని రెట్టింపు చేసింది.

చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్‌ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు. మెగామాస్ మ్యాజిక్‌ ని బిగ్ స్క్రీన్ ‌లపై చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

'పూనకాలు లోడింగ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రవితేజ ఫ్యాన్స్ కి అందరికీ వందనం. బాస్ పార్టీ పాటని ఐపాడ్ లో పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. అభిమానుల రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్ బాబు గారికి ఇష్టమైన జాతరలాంటి సినిమా వస్తుందని చెప్పాను. మనలాగే కళ్యాణ్ గారు కూడా వాల్తేరు వీరయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో పూనకాలు లోడింగ్ కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు.. సినిమా మొత్తం పూనకాలు వస్తూనే వుంటాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విశ్వరూపం వాల్తేరు వీరయ్య. సినిమా అంతా జాతరలా వుంటుంది. ఇంత పూనకాలు తెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి థాంక్స్.ఇంత గొప్ప మ్యాజిక్ స్క్రీన్ ప్రజన్స్ వున్న ఇద్దరి గొప్ప స్టార్స్ ని నా ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్. 13వ తేదిన పూనకాలు లోడింగ్ ఎనర్జీ ఏ స్థాయిలో వుంటుందో అందరూ చూడబోతున్నారు' అన్నారు

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాచేసే అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా కృతజ్ఞతలు. మేము అడిగిన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్యని గొప్పగా తీసిన దర్శకుడు బాబీ గారికి థాంక్స్. పూనకాలు లోడింగ్'పాటకు అభిమానులు ఐదు కి ఎంత రేటింగ్ ఇస్తే.. సినిమా కూడా అంతే రేటింగ్ లో వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. జనవరి 13వ తేదిన ఇంతకంటే ఎక్కువ ఆనందపడతారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో చిరంజీవి గారి కళ్ళల్లో చూశాను. ఇంత హ్యాపీ గా బాస్ ని ఈ మధ్య కాలంలో చూడలేదు. మెగా ఫ్యాన్ బాబీ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని ఎంతో ప్రేమించి నిర్మించారు. 13న తేదిన రికార్డులు ఎగురుతాయి'' అన్నారు.

రోల్ రిడా మాట్లాడుతూ.. పూనకాలు లోడింగ్ పాట రాయడం నాఅదృష్టం. ఈ పాట రాయడం మెగామాస్ ఫీలింగ్. ఈ పాటని పాడటం కూడా జరిగింది. దర్శక నిర్మాతలకు దేవిశ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. జనవరి 13న అందరం థియేటర్ లో కలుద్దాం'' తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సప్తగిరి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved