pizza
Sri Divya Weds S Sai Nikhilesh
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 October 2015
Hyderabad

 

కేసీఆర్ ముఖ్య‌అతిధిగా విజయనిర్మల మేనకోడలు శ్రీదివ్య వివాహ మహోత్సవం

నాటి మేటి కథానాయిక, సీనియర్‌ దర్శకురాలు, గిన్నిస్‌రికార్డ్‌ హోల్డర్‌ ఘట్టమనేని విజయనిర్మల మేనకోడలు, శ్రీమతి పార్వతి దేవి, శ్రీ సమర్ధి రఘునాథ్ ల ద్వితీయ పుత్రిక చి.సౌ.శ్రీదివ్య వివాహం శ్రీమతి శాఖమూరి సరస్వతి, శ్రీ శాఖమూరి శరత్ ల పుత్రుడు ఎస్‌.సాయి నిఖిలేష్‌తో అక్టోబర్ 25 ఉదయం 11.19 గంటలకు హైదరాబాద్‌ హైటెక్స్‌లో సినీ,రాజకీయ ప్రముఖుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కె.చంద్రశేఖర్‌రావు ఈ వివాహ మహోత్సవానికి విశిష్ఠ అతిధిగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈనాడు-ఈటీవీ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, హీరో, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు, మేటి నాయిక, రాజకీయనేత జయప్రద, కాంగ్రెస్‌ నేత నాదెండ్ల భాస్కరరావు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, హీరో జగపతిబాబు, హీరో సుధీర్‌బాబు-ప్రియదర్శిని దంపతులు, హీరో సాయిధరమ్‌ తేజ్‌, అగ్ర నిర్మాతలు సి.కళ్యాణ్‌, అశ్వనిదత్‌, శ్యాంప్రసాద్‌ రెడ్డి, పొట్లూరి వరప్రసాద్‌ (పివిపి), సీనియర్‌ నిర్మాత రాఘవ, సీనియర్‌ దర్శకులు కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, సీనియర్‌ ఎడిటర్‌ గౌతంరాజు, పద్మాల

య మల్లిఖార్జునరావు, సంగీతదర్శకుడు కోటి, నటులు శివకృష్ణ, నాగినీడు, నిర్మాత సురేష్‌కొండేటి, సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి తదితరులు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో సహజనటి జయసుధ, సీనియర్‌ నరేష్‌ ఆద్యంతం అతిధులకు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved