pizza
100 Days of Love Audio release on 13 July
జూలై 13న నిత్య‌మీన‌న్, దుల్క‌ర్ ల ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఆడియో
You are at idlebrain.com > news today >
Follow Us

7 July 2016
Hyderaba
d

‘ఓకే బంగారం’ సినిమా చూసిన వాళ్లంద‌రూ, దుల్కర్ సల్మాన్ – నిత్యామీనన్ జోడీకి నూటికి నూరు మార్కులు వేసేశారు. దీంతో ఈ జంట మలయాళంలో చేసిన సినిమాలు తెలుగులో అనువాదాలుగా సిద్ధమయ్యాయి. ఈ నేప‌థ్యంలో ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమా కూడా అదే టైటిల్ తో తెలుగులో రావడానికి రెడీ అయింది.

జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల 13న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఓకే బంగారంతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved