pizza
Adavari Matalaku ardhalu verule completes 13 years
13 వ‌సంతాల విక్ట‌రి వెంక‌టేష్ ఆడ‌వారి మాట‌ల‌కి.. అర్థాలేవేరులే!’ – కొన్ని విశేషాలు:
You are at idlebrain.com > news today >
Follow Us

27 April 2020
Hyderabad



కుటుంబ క‌థా చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ కొట్టిన విక్టరీ వెంకటేష్ న‌టించిన చిత్రాలు అన్ని విశేషాద‌ర‌ణ పొందాయి. విక్ట‌రి కెరీర్ లో టాప్ 10 చిత్రాలంటే వాటిలో ఖ‌చ్చితంగా ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, త్రిష ల మ‌ద్య వ‌చ్చే ల‌వ్ సీన్స్ చాలా ప్రాముఖ్య‌త క‌లిగివుంటాయి. మెచ్యుర్డ్ పీపుల్స్ మ‌ద్య ప్రేమ ని చూపించారు. అలాగే హీరో త్రండ్రి గా కొటా శ్రీనివాస‌రావు పాత్ర చిర‌కాలం నిలిచిపోతుంది. కొడుకు ప్రేమ‌కొసం అవ‌మాన ప‌డ్డ తండ్రి పాత్ర‌లో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి అని చెప్ప‌వ‌చ్చు.. అలాగ్ వెంక‌టేష్త,, కొటా శ్రీనివాస‌రావు ల మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం కామెడిగా వుంటూనే చ‌క్క‌టి ఎమెష‌న్ క‌నెక్ట‌విటి క‌లిగి వుంటుంది. సాంప్ర‌దాయాల‌కి విలువ‌నిచ్చే కుటుంబ పెద్ద‌గా కె.విశ్వనాథ్, సునీల్, జీవా, క‌ల‌ర్స్‌ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. అల్లంత దూరాన ఆ తార‌క క‌ల్ళేదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా అంటూ యువ‌త హ్రుద‌యాల‌న్ని దొచుకునే సాంగ్స్ అందించారు యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. 2007 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం… నేటితో 13 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

కొన్ని విశేషాలు..

1.విక్ట‌రి వెంకటేష్, త్రిష జంటగా నటించిన తొలి చిత్రమిది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో ‘నమో… వెంకటేశ’, ‘బాడీగార్డ్’ సినిమాలు వచ్చాయి.

2. ద‌ర్శ‌కుడు సెల్వరాఘవన్, యువన్ శంకర్ రాజా కాంబినేషన్‌లో వెంక‌టేష్ న‌టించిన ఏకైక చిత్రం. ఈ కాంబినేష‌న్ రిపీట్ కొసం చాలా మంది నిర్మాత‌లు ప్ర‌య‌త్నించారు.

3.ఈ సినిమాతో ఉత్తమ నటిగా త్రిష ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది.

4. ఉత్త‌మ నటుడు గా విక్ట‌రి వెంక‌టేష్, ఉత్తమ మాటల రచయితలు(రమేష్, గోపి) విభాగాల‌లో నంది అవార్డులు సాధించ‌టే కాకుండా ఈ చిత్రానికి ఉత్త‌మ చిత్రంగా నంది వ‌‌రించింది.

5.‘ఖుషి’ విడుదలైన రోజునే… ఆ సినిమాలోని రీమిక్స్ పాటైన “ఆడ‌వారి మాటలకు అర్థాలేవేరులే” టైటిల్‌తో సినిమా రావడం, ఆద‌ర‌ణ పొంద‌డం విశేషం.

6.ఈ సినిమాని తమిళంలో ‘యారడి నీ మోహిని’ పేరుతో రీమేక్ చేసారు. అందులో ధనుష్, నయనతార జంటగా నటించారు. అంతేకాదు… ధనుష్ కెరీర్‌లో తొలి తెలుగు రీమేక్ చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే… ఈ సినిమాని క‌న్న‌డం(‘అందు ఇందు ప్రీతి బందు’), బెంగాలీ(‘100%లవ్’), భోజ్‌పురి(‘మెహంది లగాకే రఖ్నా’), ఒడియా(‘ప్రేమ అదై అక్ష్యరా’) భాషల్లోనూ పునర్నిర్మించారు.

 


 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved