pizza
Rajnikanth - Shankar's 2.0 first look launch on 20 November in Mumbai
నవంబర్‌ 20న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌-గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ల '2.0' ఫస్ట్‌ లుక్‌
ఇండియాలోనే మొట్ట మొదటిసారి మోడ్రన్‌ టెక్నాలజీతో ముంబాయిలో విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

16 November 2016
Hyderaba
d

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను నవంబర్‌ 20న ముంబాయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ మోడ్రన్‌ టెక్నాలజీతో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్‌ యూ ట్యూబ్‌ ఛానల్‌ లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయబోతున్నారు.

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, ఎమీ జాక్సన్‌, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, నిర్మాత సుభాష్‌కరణ్‌తోపాటు '2.0' చిత్రం యూనిట్‌ సభ్యులంతా పాల్గొంటారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహిస్తారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved