pizza
7 to 4 Dasara song
You are at idlebrain.com > news today >
Follow Us

19 October 2015
Hyderabad

7 టు 4 సినిమా దసరా పాట

సమాజంలో కొందరు ప్రముఖులు వైట్ టైగర్స్ అనే రహస్య సంస్థను ఏర్పాటు చేసి నేరాలు చేసేవారిని శిక్షిస్తుంటారు. ఆ సంస్థలో భాగంగా 7 టు 4 అనే టీం ను ప్రత్యేకంగా ఆడవారిపై హత్యాచారాలు చేసే నేరగాళ్ళని పట్టుకోవడానికి నియమిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ నిగాలో ఉన్న నేరగాళ్ళు అకస్మాత్తుగా అదృశ్యం కావడం అంతుపట్టని విషయంగా మారుతుంది. వారికి వైట్ టైగర్స్ సంస్థ గురించి ఓ క్లూ దొరుకుతుంది. ఈ అంశాలను ప్రధానంగా చేస్తూ.. సినిమా నడుస్తుంటుంది. మిల్క్ మూవీస్ పతాకంపై విజయ్ శేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.

ఈ చిత్రంలో పాటల రచయిత్రి వందన ద్విభాష్యం ఈ కారు చీకటి వేటాడవచ్చారు అనే పాటను రచించగా.. ప్రముఖ గాయని ఉషా ఉత్తప్ ఆ పాటను పాడారు. దసరా నవరాత్రుల సందర్భంగా చిత్ర బృందం ఈ పాటతో పాటు సినిమాలో ’కదిలింది కాళిక’ అనే మరో పాటను కూడా విడుదల చేసారు. ఈ రెండు పాటలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు విజయ్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను కథా వస్తువుగా తీసుకొని ప్రాక్టికల్ న్యాయాన్ని విశదీకరించే చిత్రం 7 టు 4. ఈ సినిమాలో సందేశాలు, ఉపదేశాలు, సమాజగతి మారాలని చెప్పే దిశానిర్దేశాలు ఉండవు. రెచ్చిపోతున్న కీచక మూకల ద్వేషాన్ని నిలువరించి అర్దరాత్రి స్వాతంత్రానికి నిజమైన అర్ధాన్ని చెప్పి అబలకు తక్షణ న్యాయం చేసేదే 7 టు 4. దసరా నవరాత్రుల సందర్భంగా సినిమాలో రెండు పాటలను విడుదల చేసాం. సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. త్వరలోనే గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

ఆనంద్, రాధిక, లౌక్య, బాలకృష్ణ, శ్రీనివాస్, మల్లిఖార్జున్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి: రచయితలు: శ్రీకాంత్, రాజేష్, చంద్రశేఖర్, సంగీతం: శ్రీమతి స్నేహలతా మురళి, సాహిత్యం: శ్రీమతి వందన ద్విభాష్యం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఇ.కె.ప్రభాత్, కెమెరామెన్: చిరంజీవి, ఎడిటర్: సత్య గిడుదూరు, కో డైరెక్టర్: గిరీష్, డిజైనింగ్: గణేష్ రత్నం: డైరెక్టర్: విజయ్ శేఖర్ సంక్రాంతి.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved