pizza
A.. Aa success function at Siddharth Gardens, Guntur on 12 June
జూన్ 12 న గుంటూరు లో వైభవంగా 'అఆ' విజయోత్సవ వేడుక
You are at idlebrain.com > news today >
Follow Us

10 June 2016
Hyderaba
d

మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే.

ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరు లోని 'సిద్ధార్ధ గార్డెన్స్' లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ విజయోత్సవ వేడుకలోమాటల మాంత్రికుడు, దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్, సమంత, అనుపమ. నదియ, నరేష్, రావు రమేష్ ,అజయ్, హరితేజ, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ల తో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved