pizza
‘Aanandam’ to release as a summer treat on 23rd March
మార్చి 23న `ఆనందం`
You are at idlebrain.com > news today >
Follow Us

09 March 2018
Hyderabad

Malayalam movie ‘Aanandam’ has all the elements the present generation audiences would look for and the film has struck a chord with the students in Malayalam. Now this blockbuster movie is going to be released in Telugu. Yetthari Gururaj is producing the film in Telugu under Sukheebhava movies banner. Veera Venkateswara Rao (Peddababu), VRB Raju and Ravi Varma Chiluvuri are the Co-producers.

The Telugu producers couldn’t have asked for a better release date for this movie. The film is going to be released on 23rd March, just when the students are going to be free completing their exams and this movie is going to be a perfect treat for them this summer. The audio will be released on 17th March.

Students would relate themselves to the characters in this movie, which is all about what happens when a group of second year engineering students go for an industrial tour in four days. The natural performances, flawless screenplay and music are going to be the assets of this movie.

The film has already created a sensation in Malayalam. Made on a shoestring budget of Rs.5 crores, the film went on to collect more than 4 times its budget.

Nivin Pauly’s guest role is going to be special in this movie, which has all new comers except for a few actors.

The Telugu producers are very happy about the way things have fallen into place. They say, “We have bagged the dubbing rights of this movie amidst huge competition from some big producers for a fancy price. The box-office collections of this movie in Malayalam tell how big hit this film is and how the young generation audiences have loved it. As the film is very close to Telugu nativity, we decided to dub this film in Telugu, though a big producer offered a big amount for the remake rights. Except for Nivin Pauly, the film has all new actors.The three love stories in the film are beautiful and Sachin Warrier’s music is another major highlight of this movie”.

“We are planning to launch the audio on 17th March and will release the film on 23rd March. The film will be a perfect Summer treat for younger generation of audiences”, the producers added.

Arun Kurian, Thomas Mathew, Roshan Mathew, Siddhi Mahajankatti, Annu Antony, Vishak Nair and Anarkali Marikarin played the lead roles

Dialogues: M Rajasekhar Reddy, Lyrics: Vanamali, Music: Sachin Warrier, Camera: Anand. E.Chandran, Director: Ganesh Raj, Presented By: Seetharama Raju, Co-producers: Veera Venkateswara Rao (Peddababu), VRB Raju and Ravi Varma Chiluvuri, Producer: Yetthari Guru Raj

మార్చి 23న `ఆనందం`

ప్ర‌తి క్ష‌ణాన్ని ఆనందంగా గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల్లోనూ ఉంటుంది. జీవితంలో మిగిలిన రోజుల సంగ‌తి ఎలా ఉన్నా.. కాలేజీలో, క్యాంప‌స్‌లో స‌ర‌దాగా గ‌డిపే క్ష‌ణాలు మాత్రం ఆనందానికి కేరాఫ్ అడ్ర‌స్‌లు. ఓ వైపు చ‌దువు అనే బాధ్య‌త ఉన్నా... భ‌విష్య‌త్తు గురించి ఆలోచ‌న‌లు వెంటాడుతున్నా... చుట్టూ స్నేహితులు, అంద‌మైన క‌ల‌లు ఆనందాల లోకంలో విహ‌రింప‌జేస్తాయి. అలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కాలేజ్ డేస్‌లో ఆస్వాదించిన ఆనందాన్ని మ‌ర‌లా ఓ సారి తెర‌మీద చూపించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎత్త‌రి గురురాజ్‌. మ‌ల‌యాళంలో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన `ఆనందం` చిత్రాన్ని అదే పేరుతో ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ నెల 23న అందించ‌నున్నారు. మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఈ చిత్రానికి గ‌ణేశ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేర‌ళ టాప్ హీరో `ప్రేమ‌మ్` ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన న‌టీన‌టులంద‌రూ దాదాపుగా కొత్త‌వారే. తెలుగులో అనువాద‌మ‌వుతోన్న `ఆనందం` చిత్రానికి వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్‌. సీతారామ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు.

`ఆనందం` గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ ``మా `ఆనందం` అనువాద‌ ప‌నులు దాదాపుగా పూర్త‌య్యాయి. తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ నెల 17న పాట‌ల వేడుక‌ను గ్రాండ్‌గా నిర్వ‌హిస్తాం. కేర‌ళ‌లో టాప్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ల‌లో ఒక‌రైన స‌చిన్ వారియ‌ర్ స్వ‌రాల‌కు వ‌న‌మాలి అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. `హ్యాపీడేస్‌` పాట‌ల త‌ర‌హాలోనే మా పాట‌లు కూడా త‌ప్ప‌కుండా చార్ట్ బ‌స్ట‌ర్ అవుతాయి. యువ‌త చెవుల్లో మారుమోగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ఈ నెల 23న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. కేర‌ళ‌లో నిర్మాత‌లు పెట్టిన ఖ‌ర్చుకు ఐదింత‌లు మొత్తాన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాబ‌ట్ట‌గ‌లిగిందంటేనే ఈ క‌థ‌కున్న ప‌వ‌ర్‌ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగులోనూ అందుకు ధీటుగా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ప‌లువురు ఈ సినిమాను రీమేక్ చేస్తామ‌ని, రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగిన‌ప్ప‌టికీ ఆ న‌మ్మ‌కంతోనే మేం అనువాదం చేస్తున్నాం. ఎక్క‌డా మ‌ల‌యాళ సినిమా అని అనిపించ‌దు. కాలేజీ అనుభ‌వాలు అనేవి ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఒకే ర‌కంగా ఉంటాయి. మ‌న‌సు పొర‌ల్లో ప‌దిలంగా జ్ఞాప‌కాలుగా మిగిలి ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ చ‌దువుకున్న‌ రోజులు గుర్తుకొస్తాయి.

ఒక ఇండ‌స్ట్రియ‌ల్ టూర్ నాలుగు రోజులు జ‌రిగితే అక్క‌డ మూడు ప్రేమ జంట‌ల క‌థే మా సినిమా. త‌ప్ప‌కుండా ప్ర‌తి గుండెనూ త‌డుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని అన్నారు.

తారాగ‌ణం:
అరుణ్ కురియ‌న్‌, థామ‌స్ మాథ్యూ, రోష‌న్ మాథ్యూ, విశాక్ నాయ‌ర్‌, సిద్ధి మ‌హాజ‌న‌క‌ట్టి, అన్ను ఆంటోని, అనార్క‌ళి మ‌రిక‌ర్‌, నివిన్ పాల్‌, రెంజి ఫ‌ణిక్క‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర రెడ్డి, పాట‌లు: వ‌న‌మాలి, సంగీతం: స‌చిన్ వారియ‌ర్‌, కెమెరా: ఆనంద్‌. ఇ. చంద్ర‌న్‌, సహ నిర్మాతలు : వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి , ద‌ర్శ‌క‌త్వం: గ‌ణేశ్ రాజ్‌, స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌. సీతారామ‌రాజు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved