pizza
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అయాన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

21 May 2015
Hyderabad

అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై ‘టిప్పు’ ఫేమ్ సత్యకార్తీక్, సమీర, నిత్య హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. చునియా(సబిహ) స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. జూన్ 8 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా....

దర్శక నిర్మాత చునియా(సబిహ) మాట్లాడుతూ ‘’ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. టిప్పు ట్రైలర్, పోస్టర్స్ ను చూసి సత్యకార్తీక్ ను హీరోగా ఎంచుకున్నాం. కథ అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఏప్రిల్ నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం. ఇటీవలే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ను జూన్ 8న స్టార్ట్ చేస్తాం. సీనియర్ నటులు నరేష్, ఇంద్రజ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనూప్ మంచి సంగీతాన్నిచ్చారు. ప్రముఖ కమెడియన్ అలీ ఈ చిత్రంలో ఓ పాట పాడటం విశేషం. ఆ సాంగ్ రికార్డింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. పాట చాలా బాగా వచ్చింది. పలు భారీ సినిమాలకు పనిచేసిన రవీందర్ ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

సత్యకార్తీక్, సమీర, నిత్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేష్, ఇంద్రజ, అలీ, కృష్ణుడు, అనితా చౌదరి, విశ్వ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఎడిటింగ్: ధర్మేంద్ర, డైలాగ్స్: కిరణ్ కుమార్, కాస్ట్యూమ్స్: షిర్లే, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా; కన్నా కూనపరెడ్డి, ఆర్ట్; రవీందర్, కథ-నిర్మాత-దర్శకత్వం: చునియా(సబిహ).

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved