pizza
Abhinetri 3rd schedule from 15 April
తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్‌లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో 'అభినేత్రి'
You are at idlebrain.com > news today >
Follow Us

31 March 2016
Hyderaba
d

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. రాజమండ్రి, ముంబాయిలలో రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ ఏప్రిల్‌ 15న వైజాగ్‌లో ప్రారంభమవుతుంది.

హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ - ''నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాను. 'బాహుబలి' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌, 'బెంగాల్‌ టైగర్‌' వంటి కమర్షియల్‌ హిట్‌, 'ఊపిరి' వంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులు నాకు హ్యాట్రిక్‌ని అందించారు. 'ఊపిరి' తర్వాత రిలీజ్‌ అవుతున్న సినిమా ఇది. ఈ క్యారెక్టర్‌ గురించి డైరెక్టర్‌ విజయ్‌ చెప్పినపుడు చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. మూడు భాషల్లో ఒకేసారి నటించడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఫస్ట్‌ టైమ్‌ హార్రర్‌ కామెడీ మూవీలో నటిస్తున్నాను. నా కెరీర్‌లో 'అభినేత్రి' ఓ సెన్సేషనల్‌ ఫిలిమ్‌ అవుతుంది'' అన్నారు.

కోన ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న తమన్నా, ప్రభుదేవాతోపాటు తెలుగు, హిందీ, తమిళ్‌లో ఆయా భాషల ప్రముఖ నటీనటులు మిగతా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమీర్‌ఖాన్‌ 'గజిని', షారూఖ్‌ఖాన్‌ 'హ్యాపీ న్యూ ఇయర్‌' వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించిన మనీష్‌ నందన్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేస్తున్నారు. అమితాబ్‌ 'పా' చిత్రానికి ఆర్ట్‌ డైరెక్షన్‌ చేసిన వైష్ణవిరెడ్డి ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నారు. అలాగే ఎన్నో సార్లు నేషనల్‌ అవార్డులు అందుకున్న అంటోనీ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ చేయడం విశేషం. ఇలా ఇండియాలోని టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. మదరాసు పట్టణం, నాన్న, అన్న వంటి డిఫరెంట్‌ చిత్రాలను రూపొందించిన విజయ్‌ ఈ చిత్రాన్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా రూపొందిస్తున్నారు. అన్‌కాంప్రమైజ్డ్‌గా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పించడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - '''బాహుబలి' చిత్రంలో తన అద్భుత నటనతో అందర్నీ ఆకట్టుకున్న తమన్నా ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోంది. అనుష్కకు 'అరుంధతి', జ్యోతికకు 'చంద్రముఖి'లా తమన్నాకు 'అభినేత్రి' ఓ అద్భుతమైన చిత్రమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ రాజమండ్రి దగ్గరలోని ఓ విలేజ్‌లో జరిగింది. రెండో షెడ్యూల్‌ ముంబాయిలో చేశాం. మూడో షెడ్యూల్‌ ఏప్రిల్‌ 15 నుంచి వైజాగ్‌లో జరుగుతుంది. జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణవిరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved