pizza
Annapurna College of Film and Media (ACFM) in association with Vijayendra Prasad launches “Idea to Script” writer’s workshop at Annapurna Studios, Hyd.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి 'ఐడియా టు స్క్రిప్ట్' అనే రైటర్స్ వర్క్‌షాప్‌ను లాంచ్ చేస్తున్న అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం)
You are at idlebrain.com > news today >
Follow Us

8 January 2020
Hyderabad

ACFM in association with Vijayendra Prasad, the celebrated scriptwriter of blockbusters like “Baahubali” and “Bajrangi Bhaijaan” announced a hands-on writer’s workshop -“Idea to Script” - for all aspiring writers who want to make it big in Indian cinema.

Ms. Amala Akkineni, Director ACFM announced this exclusive workshop, making it a great start for the year 2020 for scriptwriting aspirants. She commented “The maestro’s pen has won billion hearts and ensured box office successes time and again. The Baahubali franchise, has got the Indian film industry ,the much needed recognition. Vijayendra Prasad’s stories have always been larger than life, and are well known to enthrall audiences bringing in high emotions through his storyline”.

She invited writers and filmmaking aspirants to participate in this hands-on workshop to co-Script the next Blockbuster, the unique advantage being learning the art & craft of script writing for commercial success directly from the master Scriptwriter K.V. Vijayendra Prasad at Annapurna Studios

Vijayendra Prasad comments, “Any amount of theoretical knowledge will not give a practical sense! Stories should be developed; you start with an idea and then build on it. Scriptwriting is all about our ability to grasp at an idea, sense its potential, and breathe life into it. The more observant we are of our surroundings, the more sensitive we become and the better is our capability to narrate a powerful story”.

This workshop will be conducted at Annapurna Studios starting January 2020.
For enquiry call 1 800 57 24736 or mail [email protected]

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి 'ఐడియా టు స్క్రిప్ట్' అనే రైటర్స్ వర్క్‌షాప్‌ను లాంచ్ చేస్తున్న అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం)

భారతీయ సినిమాలో తమ సత్తా చాటాలనుకొనే ఔత్సాహిక రచయితలందరి కోసం 'ఐడియా టు స్క్రిప్ట్' అనే రైటర్స్ వర్క్‌షాప్ నిర్వహించేందుకు.. 'బాహుబలి', 'బజ్‌రంగి భాయిజాన్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సుప్రసిద్ధ స్క్రిప్ట్ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో చేతులు కలుపుతున్నట్లు ఏసీఎఫ్ఎం ప్రకటించింది.

స్క్రిప్ట్‌రైటింగ్‌లో ఆసక్తి ఉన్నవారికోసం 2020 సంవత్సరంలో మంచి ఆరంభం ఇవ్వడానికి ఈ ఎక్స్‌క్లూజివ్ వర్క్‌షాప్‌ను ఏసీఎఫ్ఎం డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని ప్రకటించారు. "విజయేంద్రప్రసాద్ గారి కలం కోట్లాది హృదయాల్ని గెలుచుకుంది. ప్రతిసారీ బాక్సాఫీస్ విజయాల్ని అందించింది. 'బాహుబలి' ఫ్రాంచైజ్ భారతీయ చిత్రసీమకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన కథలెప్పుడూ లార్జర్ దేన్ లైఫ్‌లా ఉంటాయి. తన స్టోరీలైన్ ద్వారా భావోద్వేగాల్ని కలిగించి ప్రేక్షకుల్ని అలరించడంలో ఆయన దిట్ట" అని ఆమె చెప్పారు.

మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ అయిన కె.వి. విజయేంద్రప్రసాద్ నుంచి కమర్షియల్ సక్సెస్ స్క్రిప్ట్ రైటింగ్‌లోని మెళకువల్ని నేరుగా నేర్చుకొనే అరుదైన సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ, తదుపరి బ్లాక్‌బస్టర్ కోసం స్క్రిప్టు రూపకల్పనలో భాగం పంచే ఈ వర్క్‌షాప్‌లో పాలుపంచుకోవాల్సిందిగా రచయితలనూ, ఔత్సాహిక ఫిలింమేకర్స్‌నూ ఆమె ఆహ్వానించారు.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఎంత థీరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అది ప్రాక్టికల్‌గా ఏమంత ఉపకరించదు. కథలనేవి ఒక ఐడియాతో మొదలై, డెవలప్ అవుతాయి. ఒక మంచి ఐడియాను ఎలా గ్రహించాలో, దాన్ని ప్రభావవంతమైన ఒక కథగా ఎలా మలచాలో, దానికి ప్రాణం ఎలా పోయాలో స్క్రిప్ట్‌రైటింగ్ నేర్పిస్తుంది. మన పరిసరాల్ని ఎంత పరిశీలనా దృష్టితో చూస్తే, ఎంత సున్నితంగా మనం మారగలిగితే, ఒక శక్తిమంతమైన స్టోరీని నెరేట్ చేయగల సామర్థ్యం అంతగా మనకు అలవడుతుంది" అని తెలిపారు.

ఈ వర్క్‌షాప్ 2020 జనవరి ఆరంభంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహింపబడుతుంది.
ఎక్వైరీ కోసం 1 800 57 24736 నంబర్‌కు కాల్ చేయండి. లేదా [email protected] కు మెయిల్ చేయండి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved