pizza
Akkineni Alochanalu Telugu, Hindi books launch on 23 September
మహానటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మవిభూషణ్, నటసమ్రాట్ డా. అక్కినేని నాగేశ్వర రావు గారు రచించిన
'అక్కినేని ఆలోచనలు'
పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం
You are at idlebrain.com > news today >
Follow Us

19 September 2017
Hyderabad

మహానటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మవిభూషణ్, నటసమ్రాట్ డా. అక్కినేని నాగేశ్వర రావు గారు రచించిన 'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం వేడుక , డా. అక్కినేని నాగేశ్వరరావు గారి 94 వ జయంతి మహోత్సవం ఈనెల 23 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ,నాంపల్లి లో గల తెలుగు విశ్వ విద్యాలయం లోని ఎన్.టి.ఆర్. ఆడిటోరియం లో వైభవంగా జరుగుతుందని రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ఎం.కె.రాము తెలిపారు.

కళ ద్వారా సమాజ సేవ ధ్యేయం తో గత 48 సంవత్సరాలుగా ఉత్తమకళాత్మక విలువలతో, ఉన్నత ప్రమాణాలతో, విలక్షణ కార్యక్రమాలతో, వేలాది కార్యక్రమాలను తీర్చిదిద్దిన స్వచ్ఛంద కళాసంస్థ 'రసమయి' . గత 36 సంవత్సరాలుగా అన్ని కార్యక్రమాలతో పాటు, ప్రత్యేకంగా డా. అక్కినేని గారి జన్మదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించి గత సంవత్సరంనుండి వారి జయంతి ఉత్సవాలను కూడా అదే స్థాయిలో నిరాఘాటంగా నిర్వహించాలని సంకల్పించి మీ స్పదన కోసం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నట్లు డా. ఎం.కె.రాము తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, పుస్తకాల ఆవిష్కర్త గ, తమిళనాడు పూర్వ రాష్ట్ర గవర్నర్ గౌ.డా.కె.రోశయ్య గారు, సన్మాన కర్త, కళాబంధు డా. టి.సుబ్బరామిరెడ్డి గారు (చైర్మన్,కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, రాజ్యసభ), సభా ప్రారంభం: శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు (ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి), సభాధ్యక్షులు: పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు(కేంద్రీయ హిందీ భాషా సమితి సభ్యులు), ఆత్మీయ అతిధులు: ప్రముఖ రచయిత్రి డా. కె.వి.కృష్ణకుమారిగారు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. ఎ.ఎస్.నారాయణ్ గారు, సత్కార స్వీకర్తలు: డా.బి.వాణి గారు, డా. సత్య శ్రీ గారు. కార్యక్రమ వ్యాఖ్యాత: స్వర రమ్య వ్యాఖ్యాన పారంగత, కళారత్న శ్రీమతి ఎం.కె.ఆర్. ఆశాలత గారు. రసమయి ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకకు మీడియా మిత్రులు తప్పక విచ్చేసి తమ సహకారాన్ని అందిస్తారని కోరుతూ ...

డా.ఎం.కె.రాము
రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved