19 July 2017
Hyderabad
నూతన నిర్మాణ సంస్థ రాజధాని అమరావతి మూవీస్ పతాకం పై మయ్.వి.యర్, విశ్వకోటి మార్కండేయులు సమర్పణలో శివకుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా 'అక్రమ్'.
ఈ సినిమాతో తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ టి. అనిల్ కుమార్ తెలుగు చిత్రసీమకు అడుగుపెడుతున్నారు. అలానే మేడిది సురేశ్ ఈ సినిమాతో కథనాయకునిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. క్రైమ్ యాక్షన్ థిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శకుడు అనిల్ చెప్పారు.
దాంతో పాటు ఈ సినిమాలో హీరో త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. అక్రమ్, రానా అక్రమ్, రాక్ అనే మూడు విభన్న పాత్రల్లో సురేశ్ నటిస్తున్నట్లు యూనిట్ సభ్యలు తెలిపారు.
ఇప్పటికే పది శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని, వైజాగ్, గోవా, హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని చిత్రీకరించేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా నిర్మాత శివకుమార్ తెలిపారు.
భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఈ సినిమాకి కథ : సురేశ్, ఛాయగ్రహణం, దర్శకత్వం : టి. అనిల్ కుమార్, సంగీతం : వశీశ్ రాజ్, నిర్మాత : శివకుమారి.