pizza
Allari Naresh - Mohan Babu combination film in Srinivas Reddy direction
You are at idlebrain.com > news today >
Follow Us

27 June 2015
Hyderabad

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మంచు విష్ణు నిర్మాతగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో భారీ చిత్రం

తన విలక్షణ నటనతో ప్రతి నాయకుడు నుండి కథానాయకుడు వరకు ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి, ఆరువందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు హీరోగా సినిమా ప్రారంభం కానుంది. ఈ తరంలో తన కామెడితో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన కామెడి స్టార్ అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీచిత్రాన్ని డిఫరెంట్ మూవీస్ ను నిర్మిస్తూ నిర్మాతగా, హీరోగా అందరినీ మెప్పిస్తున్న మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved