pizza
Allu Ramalingaiah s 99 anniversary
అక్టోబ‌ర్ 1 కి 99 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న ప‌ద్మ‌శ్రీ డాక్ట‌ర్ శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు
You are at idlebrain.com > news today >
 
Follow Us

01 October -2020
Hyderabad


తెలుగు తెర‌పై హ‌స్య‌పు జ‌ల్లు అల్లు అనే నానుడి కొన్ని సంవ‌త్స‌రాలుగా వుంటూనే వుంది. ఆయ‌న మ‌న‌మ‌ధ్య లేకున్నా ఆయ‌న వ‌దిలిన ప‌దాలు బాడి లాంగ్వేజి మ‌ర‌వ‌లేని జ్ఙాప‌కాలు. ఆయ‌న న‌టించే ప్ర‌తిపాత్ర ఆయ‌న‌కే స్వంతమా అనే రీతితో న‌టించి న‌వ్వించిన ఘ‌నాపాటి పద్మశ్రీ శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. హాస్యానికి త‌ను చిరునామా అయ్యారు. హాస్యానికి పెద్ద పీట వేశారు... కాని... ఏ పాత్ర‌లోకైనా ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసి మెప్పించారు. కామెడి పాత్ర‌లు, ప‌క్క పాత్ర‌ల‌తో రొమాంటిక్ కామెడి చేయ్య‌టం, భాద్య‌త క‌లిగిన తండ్రి పాత్ర‌లు, విల‌న్ ప‌క్క‌న వుండే కామెడి విల‌న్ పాత్ర‌లు, విల‌న్ పాత్ర‌లు, స్నేహితుడి పాత్ర‌లు, జ‌మిందారు పాత్ర‌లు, బంట్రోతు పాత్ర‌లు, పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లు ఇలా ఒక‌టేమిటి స‌మాజం లో క‌నిపించే ప్ర‌తి పాత్ర‌లో ఆయ‌న న‌టించి పాత్ర‌ల్ని బ్రతికించారు. అలాగే ద‌ర్శ‌కుల‌, ర‌చ‌యిత‌న పెన్ను నుండి జాలువారిన ప్ర‌తి ఊహాజ‌నిత పాత్ర‌ల‌కి కూడా ప్రాణం పోసిన మ‌హ‌న‌టుడు శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. ఆయ‌న‌ 1000 కి పైగా చిత్రాల్లో నటించి చివ‌రి దాకా న‌టించి సినిమా పై త‌న ప్రేమ‌ని ఛాటుకున్న క‌ళామ‌త‌ళ్ళి ముద్దుబిడ్డ అల్లు రామ‌లింగ‌య్య గారు... ఎక్కువ చ

ిత్రాల్లో న‌టించి సినీ జగత్తులో చాలా మంది న‌టిన‌టుల‌కి మార్గదర్శకుడయ్యాడు. న‌ట‌న‌కి నిలువెత్తు రూపం శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. తెలుగు సినిమా చరిత్ర లో వున్న గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామ‌లింగ‌య్య గారి పాత్రలు వుండ‌టం విశేషం. హోమియోపతి డాక్ట‌ర్ గా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు అందించారు, త‌రువాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో న‌టుడుగా ఎంత బిజీ గా వున్నా కూడా త‌న వృత్తి హోమియోప‌తి ని మాత్రం వ‌ద‌ల్లేదు. వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమా న‌టీన‌టుల‌కి కూడా త‌న వైద్యాన్ని అందించారు. నిర్మాత గా మారి గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ స్టాపించి అనేక సూప‌ర్‌హిట్స్ అందించారు. అలాంటి మ‌హ‌న‌టుడు, నిర్మాత శ్రీ అల్లురామ‌లింగ‌య్య గారు పుట్టిన‌రోజు అక్టోబ‌ర్‌1 కావ‌టం విశేషం అయితే ఈ సంవ‌త్స‌రం పుట్టిన‌రోజుకి మ‌రో ఘ‌న‌త వుంది. ఆయ‌న 99 వ పుట్టిన‌రోజు కావ‌టం 2021 లో 100 సంవ‌త్సారాల పూర్తిచేసుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఒక ఫంక్ష‌న్ లో అల్ల అర‌వింద్ గారు మాట్లాడుతూ.. మా నాన్న గారు స్వ‌ర్గియ శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు త‌రువాత నేను, నా త‌రువాత మా అబ్బాయిలు ఈ సినిమా ఇండ‌స్ట్రిలోకి వ‌చ్చాము. ఈ మ‌ద్య నేను ఎయిర్‌పోర్ట్ వెళితే అక్క‌డ ఓకావిడ న‌న్ను చూసి న‌మ‌స్కారం అర‌వింద్ గారు అంటూ న‌మ‌స్క‌రించింది. అక్క‌డే వున్న‌వాళ్ళ అమ్మ కి అల్లు రామ‌లింగ‌య్య గారి అబ్బాయి అని ప‌రిచ‌యం చేసింది. నాన్న‌గారు త‌ర‌త‌రాల‌కు మా ఫ్యామిలికి గుర్తింపునిచ్చారు. అన్నారు

 

 


 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved