pizza
Allu Aravind, Dil Raju & Naga Vamsi to remake Nani's Jersey in Hindi
నాని 'జెర్సీ' ని హిందీ లో రీమేక్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ - దిల్ రాజు , నాగ వంశీ
You are at idlebrain.com > news today >
Follow Us

15 October, 2019
Hyderabad

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'జెర్సీ' మూవీ తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇందులో నాని నటన అద్భుతం. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ సినిమాను బాలీవుడ్ లో గజని లాంటి చిత్రం తో మొదటిసారి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నిర్మాతగా పేరుగాంచిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ చిత్రాలు నిర్మిస్తున్న మోస్ట్ హపెనింగ్ నిర్మాతలు దిల్ రాజు, సూర్య దేవర నాగ వంశీ లు హిందీలో నిర్మిస్తున్నారు. తెలుగులో 'జెర్సీ' సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి కూడా డైరెక్షన్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved