pizza
Allu Arjun donates Rs 1.25 crores towards Covid-19 relief
You are at idlebrain.com > news today >
Follow Us

27 March 2020
Hyderabad

 

The entire world is in a crisis, owing to the novel Coronavirus, Covid-19 outbreak. It has been declared a global pandemic by the World Health Organization. The regional and state governments in india have been putting in their best efforts to tackle the situation.

Incidentally, stylish star, Allu Arjun made a generous donation towards Andhra Pradesh, Telangana, and Kerala State governments.

Allu Arjun has announced that he will be contributing a total of Rs 1.25 crores to Andhra Pradesh, Telangana, and Kerala chief minister relief funds in order to combat Covid-19.

"The Covid-19 virus has taken the work by storm and changed our everyday lives. But even in times like these, people like doctors, nurses, police, and military personnel are putting up great contributions to the society. Drawing inspiration from them, I would like to contribute Rs 1.25 crore to the governments of Andhra Pradesh, Telangana, and Kerala. The only way to fight this virus is washing your hands regularly and staying in isolation," Allu Arjun said.

క‌రోనా పై యుద్ధానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్ల విరాళం

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావ‌త్ భార‌త‌దేశం న‌డుం బిగించింది. దేశ ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌ణ మేర‌కు 21 రోజులు పాటు ప్ర‌జ‌లంతా ఇల్ల‌కే పరిమ‌త‌మ‌వ్వ‌డానికి సిద్ధ‌మైయ్యారు. ఈ నేప‌థ్యంలో ఎటువంటి ప‌నులులేకఇల్లు గడిచే పరిస్థితి లేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అలానే ఎందరో పోలీస్ అధికారులు, డాక్టర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు, శానిటేషన్ వర్కర్లు ఇలా ఎందరో ధైర్యంగా మన గురించి పని చేస్తున్నారు. ఇక ఇలాంటి విప‌త్తులు వ‌చ్చిన ప్ర‌తిసారీ సాయానికి చిత్ర ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ముందుంటుంది. ఈ పంధాలోనే తాజాగా క‌రోనా పై పోరాటానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలకు త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో 50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు మ‌రో 50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తున్న‌ట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మ‌రో 25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించారు అల్లు అర్జున్. కేర‌ళ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌ప్పుడు 25 ల‌క్ష‌లు, చెన్నై వ‌ర‌ద‌లు వ‌చ్చిప్ప‌డు 25 ల‌క్ష‌లు విరాళాలు అల్లు అర్జున్ అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దేశ ప్ర‌ధాని మోడీ గారు రాష్ట్రా ముఖ్య‌మంత్రుల ఆదేశాలు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్ ని మనంద‌రం క‌చ్ఛితంగా పాటిద్ధాం. మనకోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లంతా ఇల్ల‌కే పరిత‌మై క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించి, ఈ ఘోర విప‌త్తు నుంచి అంద‌రం బ‌య‌ట‌ప‌డాల‌ని అన్నారు.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved