pizza
Ammayi Gola Sri Krishna Leela in November
You are at idlebrain.com > news today >
Follow Us

28 October 2015
Hyderabad

అక్యుప్రెజర్‌ చికిత్స నేపధ్యంలో 'అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల'

అక్యుప్రెజర్‌ అని పిలవబడే ఈ ఒత్తిడి చికిత్స భారతదేశంలో అత్యంత పురాతనమైనది. ఈ వైద్య విధానంలో నయం కాని రోగాలు వుండవు. ఎలాంటి మందు, మాత్ర లేకుండా వచ్చిన జబ్బుని నిముషాల్లో మటుమాయం చేసుకునే అవకాశం వుంది. ఇలాంటి చికిత్స నేపధ్యంలో తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆరోగ్యమే మహాభాగ్యం... ఆనందమే సౌభాగ్యం.. అనే కాన్సెప్ట్‌తో 'సంచలన్‌ ఫిలింస్‌' పతాకంపై యస్‌.యస్‌.వి.ప్రసాద్‌ లక్కన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత యస్‌.యస్‌.వి.ప్రసాద్‌ లక్కన చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ''ఛాతిలో నొప్పి రాగానే హార్ట్‌ ఎటాక్‌ ఏమోనని భయపడి జనం సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పటల్స్‌కి పరుగెత్తుతారు. వచ్చింది హార్ట్‌ ఎటాకా? కాదా? అనే ఈ సినిమా చూసిన వారు ముందుగా డాక్టర్‌ దగ్గరకి వెళ్లకుండా తమంతట తామే చాలా తేలికగా తెలుసుకోగలుగుతారు. మరియు ఆరోగ్యకరమైన అనేకానేక విషయాలు తెలుసుకోవడమే కాక నిత్యజీవితంలో కొన్ని చిట్కాలను పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతారు. ఒక కోటీశ్వరుని కుమార్తె అయిన 20 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల వయసున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమించిందో, అ అమ్మాయి ప్రేమించడానికి ఏమేమి చేసిందో... చూసేవారికి క్షణం క్షణం ఉత్కంఠత రేకెత్కించే కమర్షియల్‌ అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. ఇంతవరకు సినీ చరిత్రలో ఇలాంటి అక్యుప్రెజర్‌ సబ్జెక్ట్‌తో ఇలాంటి సినిమా రాలేదు. ఈ చిత్రం సెన్సార్‌ ఇటీవల కంప్లీట్‌ చేసుకుంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నాం'' అని అన్నారు.

ఈ చిత్రంలో శ్రీకర సంగమేశ్వర్‌, యార్లగడ్డ శైలజ, లీల, సాత్విక, రమణ, శ్యాంబాబు, నల్లబిల్లి విజయ్‌కుమార్‌, జయలక్ష్మి, చాందిని, డా|| ప్రవీణ్‌, శివయ్య, అమ్ములు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌, రీ-రికార్డింగ్‌: శ్రీనివాసరావు, కో-డైరెక్టర్‌: సురేష్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌: సూర్యం, మేకప్‌: ఈశ్వర్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: యస్‌.యస్‌.వి.ప్రసాద్‌ లక్కన.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved