pizza
Ampasayya Movie to Release in Telugu, Tamil and Malayalam
తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా విడుదలకు సిద్ధమవుతున్న "అంపశయ్య"
You are at idlebrain.com > news today >
Follow Us

21 March 2016
Hyderaba
d

‘అమ్మా నీకు వంద‌నం’ చిత్రం ద్వారా అద్దె త‌ల్లుల(స‌రోగేట్ మ‌ద‌ర్స్‌) హృద‌య‌వేద‌న‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ జైని ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి జైని నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అంప‌శ‌య్య‌`. న‌వ‌ల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సుప్ర‌సిద్ధ ర‌చ‌యిత అంప‌శ‌య్య న‌వీన్ తీర్చిదిద్దిన ఏళ్ళనాటి క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం ఓ సాహ‌సమే. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత ఉస్మానియా యూనివ‌ర్సిటిలో అంప‌శయ్య చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది. జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఒకే ఒక పాట ఉంది. సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం సమకూర్చగా శ్రీ హేమచంద్ర గాత్రం అందించారు. ఒక తండ్రి, పేదరికం మూలంగా, కొడుకుకు యూనివర్సిటీలో MA చదవడానికి ₹.200/- సర్దలేక (కథాకాలం 1965-70 సంవత్సరాలు) కుమిలిపోతుంటే, తల్లి తన కాళ్ళకు ఉన్న వెండి కడియాలు అమ్మి డబ్బులు తెమ్మంటుంది. కానీ, కడియాలు అమ్మితే ₹.150/-మాత్రమే వస్తాయి. వాటితోనే సర్దుకుని, చదువుకొమ్మని తండ్రి చెబుతాడు. కానీ, యూనివర్సిటీలో కట్టవలసిన ఫీజే ₹.200/- లని కొడుకు చెబితే, తండ్రి నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తాడు. ఈ సన్నివేశంలో, హీరో తల్లిదండ్రుల పాత్రలలో డైరెక్టర్ ప్రభాకర్ జైని, ప్రొడ్యూసర్ విజయలక్ష్మి జైని నటించారు. అప్పుడు, ఈ పాట మాంటేజ్ సాంగ్ గా వస్తుంది. పాట లోని సాహిత్యం గుండెలు పిండేస్తుంది.

"కొడుకా, కొమరుడా, పుత్రుడా, వంశానికి వారసుడా; కోటి ఆశల ఫలమా; పున్నామ నరకాన్ని దాటించే తీరమా...." అంటూ సాగుతుంది. కథాకాలం 1960, 70 దశకాలు కాబట్టి అప్పటి వాతావరణం, కాస్ట్యూమ్స్,ఆశలు, సమాజంలోని నమ్మకాలు, కులాల పట్టింపులు, పాత కాలపు చతుశ్శాల ఇళ్ళు, ఈ పాటలో ప్రతిబింబిస్తాయి.

ఈ సినిమాను తమిళంలో, మలయాళం లో simultaneous గా రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాము. కొంత మంది నిపుణుల సలహాలననుసరించి యింకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. DI పూర్తయింది. GV గారు రీరికార్డింగ్ చేస్తున్నారు.

శ్యామ్ కుమార్, పావని, మోనికా థాంప్సన్, శరత్, యోగి దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతినాయుడు యింకా తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది నటించారు. ఒక ప్రత్యేక పాత్రలో ఆకెళ్ళ రాఘవేంద్ర నటించారు. కెమెరా రవికుమార్ నీర్ల, కోడైరెక్టర్ నవీన్, DI రాజన్న, ఎడిటింగ్ సిందం గోపి,క్రియేటివ్ హెడ్ తిరుపతి రెడ్డి కోట.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved