pizza
Amyra Dastur about Rajugadu
సంజ‌న మంచి టాలెంటెడ్ - అమైరా ద‌స్తూర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2018
Hyderabad

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నచిత్రం `రాజుగాడు`. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో న‌టించారు. జూన్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా అమైరా ద‌స్తూర్‌తో ఇంట‌ర్వ్యూ...

అమైరా ద‌స్తూర్ మాట్లాడుతూ ``ద‌క్షిణాదిన నా తొలి చిత్రం త‌మిళంలో `అనేగ‌న్‌`. ఆసినిమా న‌న్ను చూసిన సంజ‌న ఫోన్ చేసి 2016లో `రాజుగాడు` సినిమాలో న‌టిస్తావా? అని అడిగారు. త‌ర్వాత క‌థ విన్నాను. న‌చ్చ‌డంతో ఓకే అన్నాను. తెలుగులో నిజానికి ఇదే నా మొద‌టి సినిమా. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల ఇది నా రెండో సినిమా అయ్యింది. ఇందులో రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌తాను. ఫ‌స్టాఫ్‌లో ప‌క్కా హైద‌రాబాదీ అమ్మాయిలా క‌న‌ప‌డితే.. సెకండాఫ్‌లో సంప్ర‌దాయ‌క దుస్తుల్లో క‌న‌ప‌డ‌తాను. హీరో రాజ్‌త‌రుణ్ నేను ఒకే ఏజ్ వాళ్లం. కాబ‌ట్టి ఇద్ద‌రి అభిరుచులు క‌లిశాయి. త‌ను స‌ర‌దాగా ఉంటాడు. అలాగే డైరెక్ట‌ర్ సంజ‌నాగారు గురించి చెప్పాలంటే త‌ను మంచి టాలెంటెడ్‌. న‌టీన‌టుల నుండి త‌న‌కేం కావాలో తెలిసిన వ్య‌క్తి. ఈ ఏడాది దేవాక‌ట్టా, ప్ర‌కాశ్ కోవెల‌మూడిల‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాను. దేవాక‌ట్టాగారి ద‌ర్శ‌క‌త్వంలో హిందీ ప్ర‌స్థానంలో న‌టిస్తున్నాను. ఈ సినిమా జూన్‌లో స్టార్ట్ అవుతుంది. నాకు సంజ‌య్ లీలా బ‌న్సాలీగారంటే చాలా ఇష్టం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌త్ వంటి సినిమా చేయాల‌నే కోరిక ఉంది`` అన్నారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved