pizza
నూతన  పద్మాలయ స్టూడియోలో  "అనగనగా ఒక చిత్రమ్" పాట చిత్రీకరణ 
You are at idlebrain.com > news today >
Follow Us

10 May 2015
Hyderabad

పద్మాలయ శాఖమూరి మల్లికార్జున రావు తనయుడు శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్ పతాకం పై గోవర్షని ఫిలిమ్స్ సమర్పణలో, సూపర్ హిట్ అయిన ప్రేమ కథా చిత్రమ్ దర్శకులు జె ప్రభాకర రెడ్డి స్వీయ దర్శకత్వం లో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న పూర్తి హాస్యరస ప్రేమ కథా విచిత్రమ్, " అనగనగా ఒక చిత్రమ్" పాట చిత్రీకరణ మూడు రోజుల పాటు (7,8,9 తే) నాగారం గ్రామములో నూతనంగా నిర్మించబడిన పద్మాలయ స్టూడియోలో రూపొందించిన భారి సెట్ లో చిత్రీకరించడం జరిగింది.

సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య సంగీత దర్శకత్వం లో స్వరపరచగా, మిట్టపల్లి సురేందర్ రచించిన "ముంచింది ముత్యాల కడవ దాని ముంగిట సింగులు తడువ" గీతాన్ని సింహ గానం చెయ్యగా రఘు నృత్య దర్శకత్వం లో హీరో శివ మేఘశ్రీ, డాన్సర్లల పై చిత్రీకరించారు.

"నటీనటులు"
శివ, మేఘశ్రీ, జయ ప్రకాష్ రెడ్డి, షియాజిషిండే, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, సూర్య, గిరిబాబు, రఘు బాబు, పృథ్వీ, అనంత్, జోగి బ్రదర్స్, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, అల్లరి సుభాషిని, కృష్ణ వేణి (భాహుబలి ఫేం) , బ్యాంకు విజయ్, వాజ్ పాయ్ , కోటేశ్వర రావు , గగన్, డి. వి & మధు .

"సాంకేతిక వర్గం"
కథ, మాటలు - అజయ్ , ఫోటోగ్రఫీ - వి రవి కుమార్, సంగీతం - వినోద్ యాజమాన్య, ఎడిటింగ్ - టి సాయి బాబు, ఆర్ట్ - విజయ్ కృష్ణ, మేకప్ - రంగా, కాస్టుమ్స్ - కె మురళి, స్టిల్స్ - బాలు, పి. ఆర్. ఓ. - బాలాజీ శర్మ, పబ్లిసిటీ డిజైన్స్ - వెంకట్ యమ్, నిర్మాణ నిర్వహణ - నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - కొడాలి - శ్రీనివాస రావు , ప్రొడక్షన్ మేనేజర్ - ఆర్. రాంబాబు, అసిస్టెంట్ డైరక్టర్స్ - సుదర్శన్ & హరీష్ సజ్జా, అసోసియేట్ డైరెక్టర్స్ - ఉమేష్ నాగ & డి. యమ్. మంజునాథ్ సజ్జన్, కో డైరెక్టర్ - ఎస్. నాగ శ్రీనివాసరావు, నిర్మాతలు - కొడాలి సుబ్బారావు & జె. ప్రభాకరరెడ్డి, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ, screenplay, దర్శకత్వం - జె. ప్రభాకరరెడ్డి.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved