pizza
Anaganaga Oka Chitram 3rd schedul from 6 April
You are at idlebrain.com > news today >
Follow Us

31 March 2015
Hyderabad

ద్మాలయ శాఖమూరి మల్లికార్జున రావు తనయుడు శివ , మేఘ శ్రీ హీరో హీరోయిన్ లుగా జె. ప్రొడక్షన్స్ పతాకం పై , గో వర్షని ఫిల్మ్స్ సమర్పణ లో, గతం లో సూపర్ హిట్ అయిన "ప్రేమ కథా చిత్రమ్ " దర్శకులు , ప్రముఖ ఛాయా గ్రహకులు జె . ప్రభాకర్ రెడ్డి స్వీయ నిర్మాణం లో దర్సకత్వం వహిస్తూ , కొడాలి సుబ్బా రావు తో కలిసి నిర్మిస్తున్న "అనగనగా ఒక చిత్రమ్ " మూడవ షెడ్యూల్ ఏప్రిల్ 6 నుంచి జరుగుతుంది.

శివ, మేఘ శ్రీ , జయ ప్రకాష్ రెడ్డి , షియాజీ షిండే , సూర్య , పృధ్వీ , జోగి బ్రదర్స్ , ప్రభాస్ శ్రీను , వెన్నెల కిషోర్ , కృష్ణ వేణి (బాహుబలి ఫేం) , యల్ . బీ . శ్రీ రామ్ , సత్యం రాజేష్ , సత్తన్న , తదితర ముఖ్య తారాగణం పాల్గొనబోయే పతక సన్నివేశాలతో పాటు గా ఒక మోంటేజ్ సాంగ్ చిత్రీకరించడం తో నెల ఆఖరి వరకు జరిగే షూటింగ్ తో టాకీ పార్ట్ పూర్తి కాగలదు అని, మిగిలిన 4 పాటలలో ఒక పాటను సెట్స్ లోను , మిగిలిన 3 పాటలను మే నెల లో అవుట్ డోర్ లో చిత్రీకరిస్తాం అని ఇది పూర్తి హాస్య రస విభిన్న చిత్రం గా అన్ని తరహ ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందే ఒక విచిత్రమైన హాస్య కథా చిత్రమ్ అని చిత్ర నిర్మాతలు జె. ప్రభాకర్ రెడ్డి, కొడాలి సుబ్బా రావు తెలియజేసారు .

ఈ చిత్రానికి కథా, మాటలు-అజయ్ , సినిమాటోగ్రఫీ - వి.రవి కుమార్ , ఎడిటింగ్ -సాయి , నిర్మాణ నిర్వహణ -నల్లూరి శ్రీనివాస్ , ప్రొడక్షన్ ఎగ్జీక్యూటివ్ -కొడాలి శ్రీనివాస్ రావు , ప్రొడక్షన్ మేనేజర్ -నాగి రెడ్డి , కో డైరెక్టర్ -యస్ . నాగ శ్రీనివాస్ రావు , నిర్మాతలు -జె. ప్రభాకర్ రెడ్డి, కొడాలి సుబ్బా రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫి , స్క్రీన్ ప్లే , దర్సకత్వం జె. ప్రభాకర్ రెడ్డి.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved