pizza
Anchor VJ Jayathi turns heroine
'వెన్నెల' భామ హీరోయిన్ అవుతుందోచ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

29 February 2016
Hyderaba
d

జెమిని మ్యూజిక్ రాత్రి 9 గంట‌ల నుండి 10 గంట‌ల వ‌ర‌కూ చూసే ప్రేక్ష‌కులంద‌రికి జ‌య‌తి అనే అందాల భామ‌ సుప‌రిచితిరాలు . త‌ను మాట్లాడుతూ అంద‌రిని మాట్లాడిస్తూ గంట సేపు వినోదాల వెన్నెల కురిపిస్తుంది. ప్ర‌తిరోజు సాయంత్రం ఆరు దాటితే చంద‌మామ నిండు వెన్నెల ని తీసుకువ‌స్తుంది కాని రాత్రి 9 గంట‌ల‌కు ఈ భామ మ‌రోక్క సారి నిండు వెన్నెల‌తో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రిస్తుంది. ఈ వెన్నెల రాక కోసం కుర్ర‌కారంతా నిరీక్షిస్తూవుంట‌ర‌నేది ఎంత స‌త్య‌మో జ‌య‌తి ఈరోజు ఏ రేంజిలో రెడి అయ్యి వ‌స్తుందో ని సిటీస్ నుండి విలేజ్ ల వ‌ర‌కూ ఆశ‌క్తితో చూసేవారు. జ‌య‌తి మాట్లాడే మాటల కోసం చతుర్లు కోసం ఇంకా త‌న అంద‌మైన నవ్వు కోసం .. కేవ‌లం కుర్ర‌కారు మాత్ర‌మే కాదు అమ్మాయిలు కూడా ఈ ప్రోగ్రాం కి ఫ్యాన్స్ అయ్యారు. VJ జ‌య‌తి ఈరోజు ఏ డ్ర‌స్ వెస్తుందో, ఎలాంటి ఎక్స‌స‌రీస్ పెట్టుకుందో అని చాలా ఇంట్ర‌స్టింగ్ గా చూసేవారు. ఇంత‌టి క్రేజ్ వున్న ఈ అందాలభామ‌ జ‌య‌తి ఇప్ప‌డు బుల్లితెర‌ నుండి వెండి తెర‌పైకి దూసుకువ‌స్తుంది. హీరోయిన్ గా చూడ‌చ‌క్క‌ని అందంతో భ‌య‌పెట్టి న‌వ్వించే చ‌క్క‌టి క‌థాంశంతో రానుంది. త‌న సోంత ప్రోడ‌క్ష‌న్ J94shows లోనే నిర్మాణం చేప‌ట్టింది. హీరోయిన్ గా త‌న మెద‌టి వెంచ‌ర్ కావ‌టంతో చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ అందాల భామ జ‌య‌తి త‌నే స్వ‌యంగా డిజైన్ చేసుకుని అంద‌రిని ఆక‌ట్టుకునే కాస్ట్యూమ్స్ తో ఏరోజు రిపీట్ కాస్ట్యూమ్స్ వేయ‌కుండా గ‌త‌ 6 సంవ‌త్స‌రాలుగా బుల్లితెరపై త‌న మాట‌ల తో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు వెండి తెర ప్రేక్ష‌కుల్ని ఏ రేంజిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి మ‌రి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved