pizza
Anil Gopireddy about Seetha.. Ramuni Kosam
మా దెయ్యం భ‌య‌పెట్ట‌దు..ప్రేమిస్తుంది - అనిల్ గోపీరెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

14 December 2017
Hyderabad

తెలుగు టీవీ సమర్పణలో శరత్ శ్రీరంగం, కారుణ్య జంటగా నటిస్తున్న చిత్రం `సీత..రాముని కోసం`. అనిల్ గోపిరెడ్డి సంగీత మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా డిసెంబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ ``

అమ్మాయిలు న‌మ్మ‌కంతో ప్రేమిస్తారు. ఒక‌సారి ప్రేమిస్తే అస‌లు వ‌దులుకోరు. అలా న‌మ్మ‌కంతో ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. జీవితాంతం నిల‌బెట్టుకుంటుంది. చ‌నిపోయిన త‌ర్వాత కూడా త‌న రాముని కోసం ఎదురుచూస్తుంటుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాయే `సీత‌..రాముని కోసం`. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాను తెర‌కెక్కించాను. నా స్వంత బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించిన ఈ సినిమాతో చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు.. ఆడియెన్స్ అంద‌రినీ రీచ్ కావాల‌నుకున్నాను. సాధార‌ణంగా ట్రైల‌ర్‌లో ఓ దెయ్యాన్ని చూసుంటారు. సాధారణంగా దెయ్యాన్ని చూస్తే భ‌య‌ప‌డ‌తారు. కానీ ఈ సినిమాలో దెయ్యాన్ని చూసి థ్రిల్ ఫీల‌వుతారు కానీ భ‌యంగా ఫీల్ కారు. ఇందులో నా దెయ్యాన్ని చూసి అంద‌రూ ప్రేమిస్తారు. అప్ప‌ట్లో ఆత్మ బంధం అనే సినిమా వ‌చ్చింది. త‌ర్వాత అలాంటి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాను. ఓ భ‌ర్త‌, అమ్మ‌, పాప‌..వారి మ‌ధ్య ఎమోష‌న్స్‌తో సినిమా ర‌న్ అవుతుంది. ఈ సినిమాలో సీత పాత్ర కొన్ని ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. అయితే రామ్ ఎంత త‌ప్పు చేశాడ‌నేది చూపెట్ట‌డానికి త‌ను చనిపోయినా బ్ర‌తికుంటుంది. దెయ్యాల సినిమాంటే రివేంజ్ ఉంటుంది. కానీ ఇందులోఎమోష‌న్స్ ఉంటాయి. ఇందులో స్క్రీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమాకు నేనే సంగీతం అందించాను. నా డెబ్యూ మూవీ ముహుర్తంకి సంగీత ద‌ర్శ‌కుడిగా నాకు నంది అవార్డు కూడా వ‌చ్చింది. త‌ర్వాత వైకుంఠ పాళి, ఏక‌ల‌వ్యుడు, ఈ వ‌ర్షం సాక్షిగా, బ‌స్‌స్టాఫ్ లో మూడు సాంగ్స్, బిస్కెట్ మూవీల‌కు సంగీతం అందించాను. ఇది సంగీత ద‌ర్శ‌కుడి నాకు ఎనిమిదవ సినిమా. నేను శ‌ర‌త్ శ్రీరంగంను చూడగానే నాకు రానా గుర్తుకొచ్చాడు. త‌ను యు.ఎస్ నుండి ఇండియాకు వ‌చ్చే పాత్ర చేశాడు. త‌ను యు.ఎస్‌లో బిజినెస్ మేన్‌. అస‌లు సీత ఇండియాలో త‌న స‌మ‌స్య ప‌రిష్కారానికి యు.ఎస్‌లోని వ్య‌క్తిని ఎందుకు ఎన్నుకుంద‌నేది కూడా ఈ సినిమాలో కీ పాయింట్‌గా ఉంటుంది. లీడ్ పాత్ర‌లో నటించిన కారుణ్య చౌద‌రి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎమోష‌న్‌కి లోను అయ్యేలా చేస్తుంది. భ‌ర్త కాద‌న్నాడ‌ని త‌ల్లి కూతుళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని వార్త చ‌దివి..ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. తదుపరి సినిమాను తెలుగులో చేయాలా? క‌న్న‌డ‌లో చేయాలా? అని ఆలోచిస్తున్నాను. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటాను`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved