pizza
Anil Ravipudi Interview about F3
ఎఫ్‌3 మీరు ఎన్ని అంచనాలు పెట్టుకుని వచ్చినా దాని కంటే ఎక్కువగానే ఉంటుంది - అనిల్ రావిపూడి
You are at idlebrain.com > news today >
Follow Us

23 November 2021
Hyderabad

ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు ఒక‌దానిని మించి మ‌రొక‌టి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌తో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు బ్లాక్ బస్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రిన్‌ తమ పాత్రలను పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌రు 23 అనిల్ రావిపూడి పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేఖ‌రుల‌తో మాట్లాడారు ఆ విశేషాలు..

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వరకు ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది?
- డైరెక్టర్ అయ్యాక ఇది ఆరో బర్త్ డే. ఇంకా ఎంతో ప్రయాణించాల్సి ఉంది. బర్త్ డే అయినా కూడా ఎఫ్ 3 సెట్‌‌లో పని చేస్తున్నాను. అదే ఈ బర్త్ డే ప్రత్యేకం. ఎఫ్ 2 సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో అంతకు మించి ఎంజాయ్ చేస్తారు. ఈ సారి కూడా సంక్రాంతికి వస్తే హ్యాట్రిక్ అయ్యేది. కానీ పెద్ద ఎత్తున విడుదల చేయాలని, సోలో రిలీజ్ చేయాలని సంక్రాంతి నుంచి తప్పుకున్నాం.

ఎఫ్ 3లో కథ ఎలా ఉండబోతోంది?
- ఎఫ్ 2లో భార్యభర్తల మధ్య ఉంటుంది. కానీ ఎఫ్ 3లో డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత పాత్రలన్నీ ఉంటాయి. ఇందులో కొన్ని కొత్త పాత్రలు యాడ్ చేశాం. సునీల్ గారు, మురళీ శర్మ పాత్రలను కొత్తగా తీసుకున్నాం. ముందే సీక్వెల్ చేయాలని అనుకున్నాం. కానీ అప్పుడు అంత సీరియస్‌గా కథ అనుకోలేదు. మనకంటూ ఓ ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందని అంతా అనుకోవాలి. సరిలేరు నీకెవ్వ‌రు వంటి సీరియస్ సబ్జెక్ట్ చేసిన తరువాత మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా చేయాలని అనుకున్నాను.

సీక్వెల్ అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి కదా? రిస్క్ అని భావించారా?
- మొదట్లో ఆ భయం కాస్త ఉండేది.కానీ కాన్సెప్ట్ దొరికిన తరువాత మాత్రం ఇంకా బెటర్‌గా చేయొచ్చనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎఫ్ 2లో భార్యాభర్తల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చూశాం.. ఈ సారి డబ్బు వల్ల క్లాంఫ్లిక్ట్ వస్తుంది. ఎఫ్ 2 వల్ల వచ్చిన కిక్కో, ఎనర్జీ వల్లో గానీ వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ ఇర‌గ‌దీశారు. మీరు ఎన్ని అంచనాలు పెట్టుకుని వచ్చినా దాని కంటే ఎక్కువగానే ఉంటుంది.

సినిమా షూటింగ్ ఏ దశ వరకు వచ్చింది?
- సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి. కొంత టాకీ పార్ట్ కూడా ఉంది. డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది.

అనిల్ రావిపూడ సినిమాలంటే ముందుగా మ్యానరిజం గుర్తుకు వస్తుంది.. వాటిని మీరు ఎంజాయ్ చేస్తుంటారా?
-నా ప్రతీ సినిమాలో ఏదో ఒక మ్యానరిజం ఊంటూనే వచ్చింది. కానీ ఈ సారి మాత్రం దాన్ని బ్రేక్ చేశాం. అంతేగా అంతేగా, వెంకీ ఆసనం అక్కడక్కడా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఎక్కువగా సందర్భాన్ని రియాక్ట్ అయి చేసే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక మ్యానరిజం పెడితే జనాలు కూడా ఇంతే కదా? అని అనుకుంటారు.

మీ సినిమాల్లో పాత్రలు మీరు క్రియేట్ చేసినవా? చుట్టు పక్కల నుంచి తీసుకున్నారా?
- నా చుట్టు పక్కల చూసిన పాత్రలనే సినిమాలో పెడతాను. ఎఫ్ 3లో అందరూ కనెక్ట్ అయ్యే ఓ ట్రాక్ ఉంటుంది. చిన్న పిల్లలతో నేను నా ఇంట్లో చూసిన అనుభవాలను పెట్టాను. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. థియేటర్లో ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తే.. అరే మా ప్రాబ్లమ్స్ కూడా ఇవే కదా అని అనుకుంటారు.

ఫ్రస్ట్రేషన్ అని ఎక్కువ‌గా అంటుంటారు.. మీ లైఫ్‌లో అలాంటివి అనుభవించారా?
- ఎఫ్ 2 అనేది నా బయోపిక్. మగాళ్లందరి బయోపిక్. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో అలా ఫ్రస్టేట్ అవుతుంటారు. పని చేసే చోట, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే ఫ్రస్ట్రేట్ ఉంటుంది. దానికి ఫ్రాంచైజీగా రావడం ఆనందంగా ఉంది.

ఎక్కువ మంది నటీనటులను మ్యానేజ్ చేయడం ఎలా అనిపించింది?
- ఎఫ్ 2లో కారెక్టర్స్ తక్కువగా ఉంటాయి. కానీ ఎఫ్ 3లో దాదాపు ముప్పై ఐదు మంది ఉంటారు. మొన్నే క్లైమాక్స్ షూట్ చేశాం. అంత మందిని ఎలా మ్యానేజ్ చేసే వారో అని ఈవీవీ గారిని తలుచుకున్నాను. ఆ క్లైమాక్స్ అందరికీ నచ్చుతుంది.

ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం...?
- ఎఫ్ 2 సినిమాను చేసి ఉండటంతో వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ మధ్య ఆ అండర్ స్టాండింగ్ ఉంది. వారి వల్ల ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ హీరోయిన్ల వల్లే సమస్యలు వచ్చాయి (నవ్వులు)

ఎఫ్ 3 సినిమా గురించి వెంకటేష్ గారు చాలా మాట్లాడారు. ఆయనకు బాగా నచ్చిందా?
- రీసెంట్‌గానే ఆయన ఫస్టాఫ్‌ చూశారు. నేను ఒక్కడినే బాగా చేశాను అని అనుకున్నాను..ఇదేంటమ్మ అందరూ ఇరగ్గొట్టేశారు అని వెంకటేష్ గారు అన్నారు. ఈ సారి ప్రతీ పాత్ర హైలెట్ అవుతుంది.

హీరోలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయని వినిపిస్తోంది?
- ఆల్రెడీ వచ్చేసిందా?.. నిజ‌మే వెంకటేష్ గారికి రేచీకటి ఉంటుంది. వరుణ్ తేజ్‌కు కొంచెం నత్తి ఉంటుంది. సినిమా అంతా డిస్టర్బ్ చేసేలా ఉండదు. కానీ ఎక్కడ అవసరమో అక్కడే వస్తుంది. అందరినీ నవ్విస్తుంటుంది.

ఈ సినిమాలో మీరు గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తార‌ట‌?
- ఎఫ్ 2 సినిమాలో చివర్లో నేను కనిపిస్తాను. ఈ సారి పాటలో కనిపిస్తాను. డ్యాన్సులు అయితే ఇప్పుడప్పుడే చేయను. భాస్కర భట్ల గారు రాసిన లడ్ డబ్ అనే సాంగ్‌ను ఈ మధ్యే షూట్ చేశాం. చిన్న సాకీలా ఉంటుంది. అందులో అందరం కనిపిస్తాం.

ఎఫ్ 3 కథలోకి డబ్బు ఎలా వచ్చింది?
- ఫ్రస్ట్రేషన్ ఎలా వస్తుంది అని ముందు అనుకున్నాం. ఫస్ట్ వచ్చే ఫ్రస్ట్రేషన్ వైఫ్. కళ్ల ముందు ఉంది కాబట్టి అది దొరికింది. నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేది డబ్బు. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే ఈ చిత్రంలోకి డబ్బును తీసుకొచ్చాం.

మీ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు ఉంటుంది?
- ఎఫ్ 3 చిత్రంలో పాన్ ఇండియన్ కంటెంట్ ఉంటుంది. ఇప్పటికీ నేను ఇక్కడ ఎంతో కంఫర్ట్‌గా ఉన్నాను. పాన్ ఇండియా అంటే ఆ స్థాయిలో కథ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. భవిష్యత్తులో చూద్దాం.

బాలీవుడ్‌లో ఎఫ్ 2 రీమేక్ చేస్తున్నారా?
- ఇక్కడ కుర్చిలో బాగున్నాను. ఒక ఏడాది అక్కడికి వెళ్తే ఇక్కడున్న కుర్చీ సంగతి ఏంటి? ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు(నవ్వులు)

గాలి సంపత్ రిజ‌ల్ట్‌ నిరాశ పరిచిందా?
- గాలి సంపత్ నా ఫ్రెండ్ కోసం నిలబడ్డాను. అది నా జానర్ కాదు. కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాం. తను సినిమాలు చేస్తాడు. కానీ ఈ సారి నేను బ్యాక్‌లో ఉండొద్ద‌ని అనుకుంటున్నాను. ఇన్ని పనులు ఒకేసారి చేయలేను. నా సినిమా ఏంటి? నాకు ఆడియెన్స్ ఇచ్చిన క్రెడిబులిటీ ఏంటి?. దాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్‌గా మాత్రం సపోర్ట్ చేస్తాను.

మీ కథలను ఎవరికైనా ఇస్తారా?
- నా కథను ఎవరికీ ఇవ్వను. అన్ని కథలు నా దగ్గర లేవు. ఆ టైంకు అప్పటికప్పుడు ప్లాన్ చేస్తుంటాను.

ఎంటర్టైన్మెంట్ జానర్ మాత్రమే మీకు కంఫర్ట్ అని భావిస్తున్నారా?
- అలా అని కాదు. సరిలేరు నీకెవ్వరు సినిమా దేశభక్తిని చాటుతూ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. బాలకృష్ణ గారితో చేయబోయే సినిమా ఆయన స్టైల్‌కు తగ్గట్టుగా ఉంది. అది కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు. బాలకృష్ణ గారితో చేయబోయేది రామారావు గారు స్క్రిప్ట్ కాదు. ఇప్పుడు మారింది. కొత్త కథ.

బాలకృష్ణ గారితో చేయబోయే సినిమా మీ శైలిలో ఉండబోతోందా?
- అనిల్ అంటే ఎంటర్టైన్మెంట్‌ను బాగా హ్యాండిల్ చేయలడు అని అందరూ అనుకుంటారు. కానీ ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు. బాలకృష్ణ గారితో ఫుల్ లెంగ్త్‌ కామెడీ సినిమాను చేయలేం. ఆయన శైలి వేరు. పటాస్‌లా పూర్తిగా ఆయన శైలిలోనే సినిమా చేస్తాం.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఎక్కువగా ఫన్ ఉన్నట్టు అనిపించింది?
- ఎఫ్ 2 సినిమా తరువాత వస్తున్నాం కాబట్టి ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్టుగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఎంటర్టైన్మెంట్ జోడించాం. ఆ కథకు అది అవసరం లేదు. కానీ దాని వల్లే రెవెన్యూ కూడా ఎక్కువగా వచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అనే మార్క్ ఉంది. కాబట్టి అది కచ్చితంగా ఉంటుంది.

దిల్ రాజు గారికి కథ వినిపించారా?
- నేను అసలు దిల్ రాజు గారికి కథను వినిపించను. అప్పుడప్పుడు రెండు మూడు సీన్లు వినిపిస్తాను అంతే.

కథ మొత్తం విన్నాకే దిల్ రాజు గారు ముందుకు కదులుతారు కదా? ఆయన స్కూల్ అదే కదా?
- ఏ స్కూల్ అయితే ఏముందండి. డబ్బులు బాగా వస్తున్నాయ్ కదా. (నవ్వులు)

ఈ సారి రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా?
- పెంచారు. కొత్త ఇళ్లు కూడా కొనుకున్నారు. ఎంతిస్తారు అని ఎప్పుడు అడగను. ఎంతిస్తే అంతే (నవ్వులు)

ప్రస్తుతం ఇంకా కథలు అనుకున్నారా?
- బాలయ్య గారి స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నాను. జనవరి నుంచి ఇక ఆ కథ మీదే కూర్చుంటాను. జూన్, జూలై సెట్స్ మీదకు వెళ్తాం. ఆ తరువాత మిగతా కథల గురించి ఆలోచిస్తాను.

టీజ‌ర్ తో ప్రమోషన్స్ ఏమైనా మొదలుపెడతారా?
- ప్రస్తుతం అంతా కూడా ఆర్ఆర్ఆర్ సినిమానే ఉంటుది. చూడాలి గ్రౌండ్ ఏమైనా ఖాళీ అయితే మెల్లిగావస్తాం.

దేవీ శ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారు?
- దేవీ శ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు ఎంత కావాలో అంత ఇచ్చారు. రెండు మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఇంకా రెండు ట్యూన్స్ ఇవ్వాలి. ప్రస్తుతం ఆయన పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved