pizza
Anil Ravipudi interview (Telugu) about Raja The Great
తార‌క్‌కి చెప్పిన క‌థ ఇది కాదు - అనిల్ రావిపూడి
You are at idlebrain.com > news today >
Follow Us

17 October 2017
Hyderabad

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌` త‌ర్వాత ఇప్పుడు `రాజా ది గ్రేట్‌` చిత్రంతో సిద్ధ‌మ‌య్యారు అనిల్ రావిపూడి. స్టార్ హీరో చేత ఆయ‌న బ్లైండ్‌గా న‌టింపజేశారు. ఆ సినిమా గురించి, త‌న వ్యూస్ గురించి మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు.. మీకోసం.

* క‌మ‌ర్షియ‌ల్ హీరోకి బ్లైండ్ కేర‌క్ట‌ర్ ఎలా కుదురుతుంద‌నుకున్నారు?
- బ్లైండ్ కేర‌క్ట‌ర్‌ని అటెండ్ చేయాల‌నుకున్న‌ప్పుడు కొన్ని సినిమాలు చూశాను. అంద‌రూ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్లు చేశారు. ఆర్ట్ ఫిల్మ్స్ చేశారు. కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఆ జోన‌ర్‌లో రాలేదు. అది చేస్తే బావుంటుంద‌ని చేశాను. హీరోకి ప‌క్కాగా కుదిరింది ఈ పాత్ర‌.

* మ‌న ద‌గ్గ‌ర వ‌చ్చిన సినిమాలు చూశారా?
- ఇండియ‌న్ సినిమాలు ఈ జోన‌ర్లో వ‌చ్చిన‌వి చూశాను. వాటికి భిన్నంగా ఉంటుంది. యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. బ్లైండ్ అన‌గానే ఏదో అడ్వాంటేజ్ తీసుకుని చేసిన‌ట్టు కాకుండా, చాలా ఎక్కువ‌గా హోమ్ వ‌ర్క్ చేశాం.

* ఈ సినిమాను రీమేక్ అంటున్నారుగా?
- ఏ సినిమాకీ?.. ఈ సినిమానా? కాదండీ. ఏ ద‌ర్శ‌కుడైనా సినిమా చేసే స‌మ‌యంలో కొన్ని వ‌ర‌ల్డ్ మూవీస్ చూస్తారు. స్ఫూర్తి పొందుతారు. అంతేగానీ మ‌క్కికి మ‌క్కి మాత్రం అలాగే చేయ‌రు. ఏ సినిమాకీ ఇది బేస్ కాదు. తెలుగు నేటివిటీ, తెలుగు ఎమోష‌న్స్, తెలుగు సినిమా. అంతే.

* ఒక స్టార్‌ని బ్లైండ్ కేరేక్ట‌ర్ చేసేలా ఎలా క‌న్విన్స్ చేశారు?
- అంటే ఫ‌స్ట్ ర‌వితేజ‌గారికి క‌థ చెప్పిన‌ప్పుడు ఆయ‌న‌తో నాకున్న ర్యాపో ప్ర‌కారం కాన్ఫిడెన్స్ తోనే ర‌మ్మ‌న్నారు. ఆయ‌న‌కి కూడా ఇది ఎలాంటి క‌థ అనే విష‌యం ముందు తెలియ‌దు. కానీ సెకండాఫ్‌లో రెండు, మూడు సీన్లు విన్న త‌ర్వాత ఆయ‌న‌కు న‌మ్మ‌కం పెరిగింది. అంటే దీన్ని ట్రీట్ చేయ‌డ‌మే వెరైటీగా చేశాం.

* కేవ‌లం మీమీద న‌మ్మ‌కంతో ఒప్పుకున్న‌ట్టున్నారుగా?
- అవునండీ. ఆయ‌న క‌థ విన‌గానే నువ్వు క‌థ చెప్పిన తీరు, నువ్వు డీల్ చేయ‌గ‌ల‌వ‌నే న‌మ్మ‌కం ఉంది. ఆ న‌మ్మ‌కంతోనే చేస్తున్నాను అని అన్నారు.

* ముందు రామ్‌గారికి చెప్పిన‌ట్టున్నారుగా.. ఈ క‌థ‌ను?
- అవునండీ. రామ్‌తో వెళ్లిన మాట వాస్త‌వ‌మే. తార‌క్‌గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు కూడా.. జెన్యూన్‌గా చెప్పాలంటే ఇప్పుడున్న క‌థ‌ను నేను తార‌క్‌గారికి చెప్ప‌లేదు. అప్పుడు ఉన్న క‌థ వేరు. తార‌క్‌గారితో ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక టోట‌ల్‌గా మారిపోయింది. వారిద్ద‌రికి చెప్పిన క‌థ వేరు. ఈ క‌థ వేరు. తార‌క్‌గారికి కూడా 45నిమిషాల క‌థే చెప్పా.

* సందేశం ఉంటుందా? లేకుంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుందా?
- సందేశం అంటే... హీరో పాత్ర‌లోనే డిసెబిలిటీ ఉంది కాబ‌ట్టి పాత్ర‌ల మాట‌ల్లో అక్క‌డ‌క్క‌డా మ‌న‌కు త‌గులుతూ ఉంటుంది. అంతేగానీ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు. బ్లైండ్ కేర‌క్ట‌ర్ నుంచి వ‌చ్చే ఫ‌న్‌.. వంటివ‌న్నీ ఉంటాయి.

* తొలి రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్‌. మ‌రి ఈ సినిమా చేసేట‌ప్పుడు రిస్క్ చేస్తున్నామ‌ని అనిపించ‌లేదా?
- పాయింట్ వ‌ర‌కు అనుకున్న‌ప్పుడు కాస్త ఉండేది. కానీ ట్రీట్‌మెంట్ వ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు నాకు భ‌యంగా లేదు. ఎందుకంటే మామూలు పాత్ర‌ల్లో ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ‌న్ తీసుకురాగ‌ల‌మో.. అన్నీ ఇందులోనూ చూపించాను. యాక్ష‌న్ సీక్వెన్స్ చేసేట‌ప్పుడు, మిగిలిన‌వి చేసేట‌ప్పుడు కూడా కొత్త‌గా చేశాను.

* దిల్‌రాజుకే తొలిసారి క‌థ చెప్పారా? ఇంకెవ‌రికైనా చెప్పారా?
- ముందు ఆయ‌న‌కే చెప్పా. సుప్రీమ్ త‌ర్వాత కూర్చున్న‌ప్పుడు ఈ క‌థ చెప్పాను. ఆయ‌న విని ఎగ్జ‌యిట్ అయ్యారు. ఆయ‌న‌తో నాకు చాలా కంఫ‌ర్ట్ గా ఉంటుంది. నేను ఏం అడిగినా ఇస్తారు. నా సొంత బ్యాన‌ర్‌లాగా చేసుకుంటూ వెళ్తాను.

* యాక్ష‌న్ సంబంధించి మీకు ఎలాంటి రిఫ‌రెన్స్లు తీసుకున్నారు?
- నేను ప‌దేళ్ల క్రితం ఎప్పుడో ఓ ఇంగ్లిష్ సినిమా చూశా. ఇలాంటి బ్లైండ్ యాక్ష‌న్ చేద్దాం.. బావుంటుంది. అనిపించింది. మోహ‌న్‌లాల్‌ది యోధా అని ఒక సినిమా వ‌చ్చింది. సౌండ్‌తో ఫైట్ చేయ‌డం వంటివి న‌చ్చాయి. అప్పుడే ఎగ్జ‌యిట్ అయ్యా.

* ఇంకేం హైలైట్ ఉంటాయి?
- రాధికాగారు మ‌ద‌ర్‌గా చేశారు. ఆవిడ సినిమాలో డ్రైవ్ చేసే అంశాలు చాలా బావుంటాయి. రీసెంట్ టైమ్‌లో ఆమెకు కంబ్యాక్‌లాంటి సినిమా. ప్ర‌కాష్‌రాజ్‌గారు తొలి 15 నిమిషాలు చాలా బాగా చేశారు. అన్న‌పూర్ణ‌మ్మ‌, పృథ్వి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు.. చాలా మంది ఉన్నారు. చాలా చేశారు.

* ఈ క‌థ వేరు, రామ్ క‌థ వేరు.. అన్నారుగా..?
- కొన్ని టెక్నీక‌ల్ ఇష్యూస్ వ‌ల్ల అది జ‌ర‌గ‌లేదు అంతే. రెండు బ్యాన‌ర్లు చేయ‌డం అలాంటివాటి వ‌ల్ల కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత తార‌క్‌గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న‌కు కంప్లీట్ సినిమా చెప్ప‌లేక‌పోయా. ఆ త‌ర్వాత ర‌వితేజ‌గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న ఓకే అన్నారు. ఈ గ్యాప్‌లో నాకు కంప్లీట్ స్క్రిప్ట్ చేసుకోవ‌డానికి టైమ్ దొరికింది.

* నెక్స్ట్ మూవీ తార‌క్‌గారితో ఉండొచ్చా?
- నిజంగా ఆయ‌న ఇస్తే చాలా హ్యాపీ.

* కేర‌క్ట‌ర్ బేస్డ్ సినిమానా? లేకుంటే స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమానా?
- యాక్చువ‌ల్‌గా హీరోయిన్ ప్రాబ్ల‌మ్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. మ‌ధ్య‌లో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. రెండూ ప్ర‌ధానంగా సాగే సినిమా. స్క్రీన్ ప్లే బావుంటుంది.

* ఇందులో హీరో ఏం చేస్తాడు?
- రాధిక‌గారు పోలీస్ కానిస్టేబుల్‌. త‌న కొడుకును పోలీస్ చేయాల‌నుకుంటుంది. అయితే అత‌ను విజువ‌లీ చాలెంజ్డ్ ప‌ర్స‌న్. మ‌రి ఆమె దాన్ని అధిగ‌మించి ఎలా చేయ‌గ‌లిగింది? అనేది కాన్సెప్ట్. ట్రైనింగ్ కూడా చాలా బావుంటుంది. హీరోగారి అబ్బాయి మ‌హాధ‌న్ చేశాడు. చాలా బాగా చేశాడు. హీరోగారి చిన్న‌ప్ప‌టి కేర‌క్ట‌ర్ అన్న‌ప్పుడు వాళ్ల‌బ్బాయినే తీసుకోవ‌డం చాలా మంచిద‌ని చేశాం. మ‌హాధ‌న్ చాలా బాగా చేశాడు.

* హీరో పేరు రాజా..
- కేర‌క్ట‌ర్ పేరు రాజా. మ‌ద‌ర్ రాజాది గ్రేట్ అని అంటుంది. పాట‌లు కూడా సిట్చువేష‌నల్ సాంగ్స్ ఉంటాయి. సినిమాలో రొమాన్స్ ఉండ‌దు. జెన్యూన్ ఫీల్ ఉంటుంది. హీరోకి ఎలా రీచ్ అవుతుంద‌నేది బాగా చూపించాం.

Anil Ravipudi interview gallery

* స్టార్ హీరోతో ఇదే ఫ‌స్ట్ టైమ్ క‌దా.. ఒత్తిడి ఉందా?
- ఉన్న‌మాట వాస్త‌వ‌మే. విజువ‌లీ చాలెంజ్డ్ కావ‌డంతో చాలా టెన్ష‌న్ తీసుకున్నా. మానిట‌ర్ ముందు కూర్చునేవాడిని. ఎక్క‌డైనా దొరుకుతారా అన్న‌ట్టు చూస్తూ ఉండేవాడిని. కానీ ర‌వితేజ‌గారు ఎక్క‌డా దొర‌క్కుండా చేశారు. ఆయ‌న కెరీర్ మొత్తంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్.

* బ్లైండ్ పాత్ర కోసం హోమ్‌వ‌ర్క్ చేశారా?
- చేశానండీ. ఒక మ‌నిషి మాట్లాడేట‌ప్పుడు ఎలా ఉంటుంద‌ని చూశా. కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ బాగా ఉంటాయ‌ని నాకు తెలిసింది. వారికి ఎక్క‌డా లోపం గురించిన ఆలోచ‌న‌లు ఉండ‌వు. వాళ్లు పాట‌లు పాడ‌తారు. డ్యాన్సులు చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చూస్తే 15 మంది ఆడ‌పిల్ల‌లు కోలాటం డ్యాన్సులు చేశారు. అంద‌రూ సేమ్ టైమింగ్‌తో చేశారు. ద‌ట్స్ రియ‌లీ గ్రేట్‌.

* మీ చిత్రాల్లో దివ్యాంగుల‌ను ఎందుకు స్ట్రెస్ చేస్తుంటారు?
- వాళ్ల మీద నాకున్న రెస్పెక్ట్ అయి ఉండ‌వ‌చ్చు.

* ప‌టాస్ ముందు ర‌వితేజ‌కు చెప్పార‌ట క‌దా?
- `ద‌రువు`కు వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు చెప్పా. ఆ స‌మ‌యంలో టెంప‌ర్ అనే సినిమా క‌థ‌, స‌మ‌ర్ అనే టైటిల్‌తో మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌గారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అప్పుడు ర‌వితేజ‌గారు ఈ క‌థ విని `అనిల్ నీ క‌థా బావుంది. ఈ క‌థా బావుంది.. పాయింట్ వైజ్ సిమిల‌ర్‌.. బ‌ట్ ట్రీట్‌మెంట్ ఈజ్ డిఫ‌రెంట్. అక్క‌డ నేను మాటిచ్చేశాను` అని అన్నారు. స‌రేన‌ని చెప్పా.

* ద‌ర్శ‌కుడిగా మీకు ఈ సినిమా ఎలాంటి శాటిస్‌ఫేక్ష‌న్ ఇచ్చింది?
- ఈ సినిమా కంప్లీట్ శాటిస్‌ఫేక్ష‌న్ ఇచ్చింది. నీట్‌గా ఈ క‌థ‌ను ఎగ్జిబిట్ చేయ‌గ‌లిగాం.

* ఈ సినిమాలో హీరోయిన్ బ్లైండా?
- కాదండీ. కానీ త‌న‌ది చాలా ఇంపార్టెంట్ పాత్ర‌.

* నెక్స్ట్ సినిమా ఏంటండీ?
- ఇంకా తెలియ‌లేదండీ.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved