pizza
King Akkineni Nagarjuna Lunched Trailer Of Raj Tarun, Sreenu Gavireddy, Annapurna Studios, SVC LLP Anubhavinchu Raja
రాజ్ తరుణ్, శ్రీను గవిరెడ్డి, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ ‘అనుభవించు రాజా’ ట్రైలర్‌ను విడుదల చేసిన కింగ్ నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

17 November 2021
Hyderabad

Young and talented hero Raj Tarun’s out and out entertainer Anubhavinchu Raja directed by Sreenu Gavireddy and produced by Annapurna Studios Pvt Ltd, in association with Sree Venkateswara Cinemas LLP (SVC LLP) gets its theatrical trailer released. King Akkineni Nagarjuna has launched the trailer and conveyed his best wishes to the entire team.

The trailer starts off showing the childhood episode of Raj Tarun who dances at a theatre where we can see a huge cut-out of Nagarjuna. Cut to present, he is working at a software firm as a security guard. Kashish Khan is a techie working in the firm. While Raj Tarun is in love with this girl, she doesn’t like security guards.

When she asks him to show his original, we get to see the original side of Raj Tarun who is a rich guy in his village and leads a lavish life. He is now willing to become president of the village. The trailer also introduces other important characters of the movie.

Sreenu Gavireddy wins brownie points for his witty writing and wonderful taking, wherein production values are first class. Visuals look vibrant, thanks to the brilliant camera work of Nagesh Banell. Gopi Sundar adds fun quotient with his background score. On the whole, the trailer offers nonstop entertainment and takes the expectations on the film to another level.

Actually, Nagarjuna begun the movie promotions by releasing first look of Anubhavinchu Raja. Then, mega power star Ram Charan unleashed teaser. While Yuvasamrat Naga Chaitanya released first single of the movie, Pooja Hegde launched second single. Certainly, all the promotional content received tremendous response.

Kashish Khan is the leading lady opposite Raj Tarun in the movie produced by Supriya Yarlagadda. Gopi Sundar rendered soundtracks, while Nagesh Banell handled cinematography. Bhaskarabhatla is the lyricist and Chota K Prasad is the editor.

Anubhavinchu Raja is getting ready for theatrical release on November 26th.

Cast: Raj Tarun, Kashish Khan, Posani Krishna Murali, Aadukalam Naren, Ajay, Sudharshan, Tempar Vamsi, Aadharsh Bhalakrishna, Ravi Krishna, Bhupal Raju, Ariyana

Technical Crew:
Written & Direction: Sreenu Gavireddy
Producer: Supriya Yarlagadda
Banners: Annapurna Studios Pvt Ltd, Sree Venkateswara Cinemas LLP
Music: Gopi Sundar
Executive Producer: Anand Reddy Karnati
Cinematographer: Nagesh Banell
Editor: Chota K Prasad
Lyrics: Bhaskara Bhatla
Art Directors: Supriya Battepati, Ramkumar
Choreographer: Vijay Binni
Fight Master: Real Sathish
Costume Designer: Rajini.P
Co-Director: Sangamitra Gaddam
Pro: Vamsi-Shekar

రాజ్ తరుణ్, శ్రీను గవిరెడ్డి, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ ‘అనుభవించు రాజా’ ట్రైలర్‌ను విడుదల చేసిన కింగ్ నాగార్జున

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

‘రూపాయి పాపాయిలాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 115 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో రాజ్ తరుణ్ పాత్రలోని రెండు కోణాలను చూపించారు. సిటీలో సెక్యురిటీ గార్డ్, ఊర్లో జాలీగా ఎంజాయ్ చేసే బంగారం పాత్రలో రాజ్ తరుణ్ మెప్పించారు. బంగారం గాడి లాంటి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తా ఉంటది.. పోతా ఉంటది.. ఏదీ పర్మనెంట్‌గా ఉండదు.. అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో పాత్ర స్వరూపం ఏంటో అర్థమవుతుంది. ఈచిత్రంలో కశిష్ ఖాన్ టెక్కిగా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో సినిమా ఎలా ఉండబోతోందో చూపించేశారు.

దర్శకుడు శ్రీను గవిరెడ్డి అద్బుతమైన కథకు, మంచి మాటలు రాసుకున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్‌లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్స్‌లో కనిపిస్తున్నాయి. నాగేష్ బానెల్ కెమెరావర్క్‌తో ట్రైలర్ నిండుగా కనిపించింది. గోపీ సుందర్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్‌ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

నాగార్జున ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక రెండో పాట ‘నీ వల్లే రా’ లిరికల్ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. ప్రతీ ఒక్క ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన వచ్చింది.

సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నాగేష్ బానెల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. పాటలు భాస్కరభట్ల రాయగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నవంబర్ 26న అనుభవించు రాజా థియేటర్లోకి రాబోతోంది.

నటీనటులు : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా

సాంకేతిక బృందం
రచయిత, దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి
నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం : గోపీ సుందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి
సినిమాటోగ్రఫర్ : నాగేష్ బానెల్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
లిరిక్స్ : భాస్కర భట్ల
ఆర్ట్ డైరెక్టర్ : సుప్రియ బట్టెపాటి, రామ్ కుమర్
కొరియోగ్రఫర్ : విజయ్ బిన్నీ
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
క్యాస్టూమ్ డిజైనర్ : రజినీ.పి
కో డైరెక్టర్ : సంగమిత్ర గడ్డం
పీఆర్వో : వంశీ-శేఖర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved