pizza

Anupama Parameswaran interview about Rakshasudu
డైరెక్షన్ అంటే ప్యాషన్... భ‌విష్య‌త్‌లో తప్పకుండా డైరెక్షన్ చేస్తా - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

You are at idlebrain.com > news today >
Follow Us

25 July 2019
Hyderabad

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాక్షసుడు". తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో ఒక ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో ప్రస్తుతం లక్షలాది వ్యూస్ తో వీక్షకుల అభిమానంతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఆగష్టు 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇంటర్వ్యూ..

రాక్షసుడు సినిమా గురించి చెప్పండి?
- ఈ సినిమాకు రమేష్ వర్మ నన్ను కాంటాక్ట్ అవడానికి ముందే మా నాన్న గారు సినిమా చూసి చాలా మంచి స్క్రిప్ట్ ఒక సారి చూడు అని చెప్పారు. కానీ అప్పుడు షూటింగ్ వల్ల నేను చూడలేక పోయాను. కొన్ని రోజుల తరువాత చూశాను. చాలా బాగుంది. ఆ తమిళ్ “రాక్షసన్” సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ ‘రాక్షసుడు’ వస్తోంది. ముందుగా ఈ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. . సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు హైలెట్ గా ఉంటాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఒక మంచి సినిమాలో భాగం అవ్వాలని ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
- తమిళ్ లో ఈ క్యారెక్టర్ అమలా పాల్ చేసింది. ఆవిడ ఇంటెన్స్ లుక్ అంటే నాకు ఇష్టం. ఈ క్యారెక్టర్ కి ఆవిడకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక నా విషయానికి వస్తే ఈ సినిమాలో టీచర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. అయితే తనలా యాక్ట్ చెయ్యటానికి నేను ఎక్కడా ట్రై చెయ్యలేదు. సినిమాను మలుపు తిప్పే ఒక కీలక పాత్ర. నేనింత వరకూ ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. దీనికోసం కొంత రీసెర్చ్ చేశాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్మెంట్ లో ఉన్నాను.

interview gallery



సాయి శ్రీనివాస్ తోకలిసి నటించడం ఎలా ఉంది?
- సాయి శ్రీనివాస్ చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. ప్రతి సీన్ బాగా రావడానికి తనవంతు ప్రయత్నం పూర్తిగా చేస్తారు. ఈ సినిమాలో ఆ సైకో కిల్లర్ ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్ని ఈ సినిమాలో వైవిధ్యంగా ఉంటాయి. అలాగే యాక్షన్ తో పాటు డాన్స్ లు ఇరగదీసాడు.

ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పారా ?
- నేనే చెప్పాను. కానీ డబ్బింగ్ చెప్పే సమయంలో నిజానికి నా వాయిస్ అసలు బాగాలేదు. డైరెక్టర్ గారికి చెప్పాను. ప్రజెంట్ వాయిస్ బాగాలేదు వేరే ఎవరితో అయినా చెప్పించండి అంటే .. లేదూ నేనే చెప్పాలి అని రమేష్ వర్మగారు పట్టుబట్టారు. కొంత మెడికేషన్ తీసుకొని నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను.

మీకు దర్శకత్వ శాఖలో అనుభవం ఉంది కదా ? భ‌విష్య‌త్‌లో డైరెక్ట‌ర్ అవుతారా?
- అవును. ఓ మలయాళ సినిమాకిఅసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అసిస్టెంట్ గా పని చేస్తోన్నప్పుడు నిజంగా అసిస్టెంట్ గానే పనిచేసేదాన్ని. ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అయినా డైరెక్షన్ అంటే ప్యాషన్. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.భ‌విష్య‌త్‌లో తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. కొన్ని ఐడియాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం యాక్టింగ్ పైనే నా దృష్టి అంతా ఉంది.త్వరలోనే వాటిని ఇంప్లిమెంట్ చేసి వివరాలు తెలియజేస్తాను.

మీరు సౌత్ అన్ని భాషల్లో నటిస్తున్నారు ? ఏ భాషలో మీకు ఎక్కువుగా కంఫక్ట్ ఫీల్ అవుతారు ?
- తెలుగులో మలయాళంలోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. కన్నడలో ఒక సినిమా అండ్ తమిళ్ లో ఒక సినిమా మాత్రమే చేశాను. బేసిగ్గా మలయాళం అండ్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి.. ఇక్కడే నాకు ఎక్కువుగా కంఫర్ట్ ఉంటుంది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కూడా రెండు కథలు ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ప్రెజెంట్ అయితే రాక్షసుడు సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఉన్నాను.త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు అనుపమ పరమేశ్వరన్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved