pizza
Appudalaa Ippudilaa post production work completed
You are at idlebrain.com > news today >
Follow Us

11 August 2015
Hyderabad

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘అప్పుడలా ఇప్పుడిలా’

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...

దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ ‘’ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సుమన్, నరేష్, సూర్యతేజ, హర్షికి సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ ‘’మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు. ఇటీవల విడదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సునీల్ కశ్యప్ గారు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తాయి. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేసి, సెప్టెంబర్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మాట్లాడుతూ ‘’మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మ్యూజిక్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్. మంచి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. ఈ నెలాఖరున ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, కథ: బ్రహ్మారెడ్డి కమతం, మాటలు: పానుగంటి జయంత్, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ, ఆర్ట్: గోవింద్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, సంగీతం: సునీల్ కశ్యఫ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved